అసలు శివాజీ కి ఏమైంది?

Hero Shivaji Fires On BJP

12:10 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Hero Shivaji Fires On BJP

ప్రత్యేక హోదా గురించి తరచూ తన గళం వినిపిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న హీరో శివాజీ మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరంలేదన్న వాళ్ల చెంప పగలగొట్టాలని . ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు శివాజీ అనేసాడు. ఎపి స్పెషల్ స్టేటస్ విషయంలో బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు దారుణమని, ఎపిని కాంగ్రెస్ కన్నా బిజెపి ఎక్కువ మోసం చేస్తోందని శివాజీ కారాలు మిరియాలు నూరాడు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కుని, అది సాధించుకునేంతవరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేసాడు. ప్రస్తుతం ఎపిలో బిజెపికి మొహం చెల్లే పరిస్థితి లేదని, ఎపిని స్వర్గధామం చేస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు మాటమారుస్తుందని మండిపడ్డాడు. ఏ పార్టీకీ భజన చేయాల్సిన అవసరం తమకు లేదని, ప్రత్యేకహోదా సాధనే తమ ధ్యేయమని కూడా శివాజీ చెబుతున్నాడు. వర్షాకాలంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రయివేటు బిల్లుకు ఓటెయ్యాలని ఆయన అన్ని రాజకీయపార్టీలను కోరారు. మరి ఈయన మాట ఎవరు వింటారో చూద్దాం.

ఇవి కూడా చదవండి:ఆ పనులు చేసే దానిలా కనిపిస్తున్నానా?

ఇవి కూడా చదవండి:ఆ ప్రశ్నతో సమంతకు దిమ్మ తిరిగింది

ఇవి కూడా చదవండి:బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

English summary

Tollywood Actor Shivaji again fired on BJP for announcing that there is no need of Special Status For Andhra Pradesh. He requested all the Political Parties Of Andhra Pradesh that to vote for Special Status for Andhra Pradesh in Parliament.