తెలుగు తెర పై మరో విలన్!

Hero Shivaji To Turn As Villain

11:00 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Hero Shivaji To Turn As Villain

ఒకప్పుడు విలన్ గా వేసి వేసి , హీరోలయ్యేవారు. ఇలా అగ్రహీరోలు అయిన వాళ్ళున్నారు. మరికొందరు హీరోలుగా వేసి, ఇక లాభాలేదని గ్రహించి, క్యారక్టర్ ఆర్టిస్ట్, కుదరని పక్షంలో విలన్ వేషం వచ్చినా సరే వేయడానికి వెనుకాడ కుండా తమ కెరీర్ కాపాడుకోవడం కూడా చూస్తున్నాం. ఆవిధంగా కూడా రాణిస్తూ, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేస్తున్నారు. ఒకప్పటి హీరో సుమన్ , ఆ తర్వాత జగపతి బాబు అలా చేస్తున్న వారే. ఇప్పుడు అదే బాట పట్టడానికి హీరో శివాజీ కూడా రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్.

మిస్సమ్మ తదితర చిత్రాలతో హీరోగా మంచి ఫెర్ఫార్మెన్స్ చూపించి , కొన్ని సొంత చిత్రాలు కూడా నిర్మించిన శివాజీ సడన్ గా ప్రజా ఉద్యమాలలో దూకాడు. వోల్వో బస్సు దగ్దం కేసులో బాధితుల తరపున ఉద్యమించిన శివాజీ ఆతర్వాత ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించబోనంటూ ఆందోళనకు శ్రీకారం చుట్టిన శివాజీ ఓ దశలో దీక్ష వరకూ వెళ్లి, హైప్ తెచ్చాడు. అయితే, ఆయన పోరాటానికి రాజకీయ పార్టీల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. పైగా బిజెపి నాయకత్వం ఆగ్రహానికి కూడా గుర యిన శివాజీ క్రమంగా ఆ ఆందోళన నుంచి వెనక్కి తగ్గాడు. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

రాజకీయాలపై వైరాగ్యంతో ఆయన తిరిగి సినిమాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన చేసిన మూడు సినిమాలు ఆగిపోయాయని అంటున్నారు. వాటిని కొనేవాళ్లు లేక ల్యాబ్‌లో మురిగిపోతున్నాయట. దీంతో సినిమాలో ఆయన రూట్ మార్చి, సినిమా బాట పట్టి, విలన్ వేషాలకు సై అన్నట్లు వార్తలొస్తున్నాయి.

ఈ క్రమంలోనే సన్నిహిత మిత్రుడు, నిర్మాత వేణుగోపాల్ సలహా మేరకు రెండు మూడు సినిమాల్లో శివాజీ విలన్‌గా నటించాడని టాక్ నడుస్తోంది. చిరంజీవి హీరోగా నటించిన ఇంద్రలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర వేసిన అనుభవం కూడా ఉందేమో, విలన్ వేషాలు వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. శివాజీ కోసమే కొన్ని పాత్రలు డిజైన్ చేసి, విలన్‌గా చూపిస్తానని నిర్మాత వేణుగోపాల్ అంటున్నారు. తాజాగా, షీ అనే సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్న ట్టు చెబుతున్నారు.

English summary

Actor Hero Shivaji to act as villain.Till now he acted as hero and due to some problems his movies were not released upto now.So a news came to know that he changed his mind set and he was ready to do villain roles