చెన్నై వరదల్లో సిద్ధు ఇల్లు, స్టూడియోలు నాశనం..

Hero Siddharth losed his house, cars and studio in floods

06:06 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Hero Siddharth losed his house, cars and studio in floods

చెన్నై వరదల్లో సర్వం కోల్పోయిన వారికి హీరో సిద్ధార్ధ్‌ పది రోజులు పాటు ఏ విధంగా సాయం చేశాడో అందరకీ తెలిసిందే. రీల్‌ హీరో నుండి రియల్‌ హీరోగా మారిన సిద్ధార్ధ్‌ని ఎంతో మంది అభిమానించారు. ఒక గొప్ప వ్యక్తిలా తనని సంభోధించారు. ప్రజలు వరదల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇల్లు, ఆస్తులు కోల్పోయిన వారికి సిధ్ధూ తన స్నేహితుల సహకారంతో ఎంతో సాయం చేశాడు. వేలాది మందికి ఆహారం, నీళ్ళు, వైద్య సదుపాయం అందేలా చేశాడు. చెన్నై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో సిధ్దు ఒక విషయాన్ని మీడియాకి తెలియజేశాడు.

చెన్నై వరదల భీభత్సం వల్ల నేను కూడా నా ఇల్లుని కోల్పోయాను, మూడు కార్లు, మూడు స్టూడియోలు ఈ వరదల తాకిడికి అస్తవ్యస్తం అయ్యాయి. నా పరిస్ధితే అలా ఉందంటే ఇంక సామాన్యుల పరిస్ధితి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్ధితి లో ఆ భాదితులకి నా వంతు సాయం చెయ్యడం మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ సిధ్ధూ తెలియజేశాడు. ఇటువంటి పరిస్ధితిని గుర్తించి, ఎంతో మంది బాధితులకి సాయం చెయ్యడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయమని సిద్ధూ మెచ్చుకున్నాడు.

English summary

Hero Siddharth losed his house, cars and studio in Chennai floods.