శివాజీ సూసైడ్ చేసుకుంటాడట.. ఈసారి చంద్రబాబు టార్గెట్

Hero Sivaji says that i will get suicide near Chandrababu house

10:40 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Hero Sivaji says that i will get suicide near Chandrababu house

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్న సాధన సమితి అధ్యక్షుడు, హీరో శివాజీ ఈమధ్య ఎందుకనో మౌనంగా ఉన్నట్టు కనపడినా మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. వచ్చీరావడంతోనే ఓ సంచలన ప్రకటన చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకుండా ప్యాకేజీకి అంగీకరిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిముందు తాను సూసైడ్ చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన శివాజీ, ఈ పాపంలో అందరికీ భాగస్వామ్యం వుందని ఆరోపించాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. దీనికోసం అందరం పోరాడుదామని అంటున్నాడు.

అలాగే పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకు అన్నిపార్టీలు మద్దతు తెలపాలని కోరుతున్నాడు. మొత్తానికి ఈ యవ్వారం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.

English summary

Hero Sivaji says that i will get suicide near Chandrababu house