షాక్: శ్రీకాంత్ 'మెంటల్' సినిమా డైరెక్టర్ ఆత్మహత్య!

Hero Srikanth Mental movie director want to attempt suicide

05:42 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Hero Srikanth Mental movie director want to attempt suicide

ఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్ కి గత ఐదారేళ్లుగా విజయాలు లేక మార్కెట్ మొత్తం పడిపోయిన సంగతి తెలిసిందే.. అయినా సరే వరుసగా సినిమాలు చెయ్యడం అవి అట్టర్ ప్లాప్ అయి కూర్చోవడం షరా మామూలే.. అయితే శ్రీకాంత్ నటించిన తాజా చిత్రం 'మెంటల్'. ఈ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. వివాదాలు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు కానీ, కొన్ని వివాదాలు చూస్తూంటే అయ్యో అనిపించకమానదు. ముఖ్యంగా క్రియేటివ్ రైట్స్ విషయంలో వివాదాలు ఆత్మహత్యా సదృశ్యమే. తాజాగా శ్రీకాంత్ తో 'మెంటల్' అనే చిత్రం రూపొందించిన దర్శకుడు కరణం బాబ్జీకు అదే సమస్య ఎదురైంది. తన సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మహత్య చేసుకోవటమే గతి అంటున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్ హీరోగా 'మెంటల్ పోలీస్' అనే టైటిల్ పై మూవీ రూపొందగా.. పోలీసుల అభ్యంతరాలతో చివరకు ఈ మూవీ 'మెంటల్' గా పేరు మార్చుకుంది. ఇప్పుడీ చిత్రం డైరెక్టర్ వ్యవహారం వివాదంగా మారింది. తొలుత ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేసినప్పుడు దర్శకుడిగా కరణం పి. బాబ్జీ పేరు పోస్టర్లలో కనిపించింది. టీజర్ లో కూడా ఈ పేరే ఉంది. కానీ ఈ శుక్రవారం థియేటర్లలోకి మెంటల్ వచ్చేసరికి.. డైరెక్టర్ పేరు మారిపోయింది. నేమ్ క్రెడిట్స్ లో డైరెక్షన్- బషీద్ అని పడింది. దీంతో ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు దర్శకుడు బాబ్జీ. అయితే సినిమా నిర్మాత కంప్లెయింట్ చేస్తేనే యాక్షన్ తీసుకోగలమని వాళ్లు చెప్పడంతో ఇప్పుడీ దర్శకుడు న్యాయం కోసం పోరాడుతానంటున్నాడు.

ఇది కూడా చదవండి: ఒకే వేదికపైకి రానున్న కేసీఆర్-పవన్

ఇది కూడా చదవండి: ఇండియాకి స్వర్ణం, కాంస్యం తెచ్చిన వీరులు వీరే!

ఇది కూడా చదవండి: ట్రంప్ ఓటమికి 135 కోట్లు కేటాయించారట!

English summary

Hero Srikanth Mental movie director want to attempt suicide.