మూడు గ్రామాలను దతత్త తీసుకున్నాడు!

Hero Surya adopted three villages in tamil nadu

11:43 AM ON 16th December, 2015 By Mirchi Vilas

Hero Surya adopted three villages in tamil nadu

చెన్నైలో సంభవించిన వరదల వల్ల దిగువ ప్రాంతంలో ఉన్న ఎన్నో గ్రామాలు అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరదలు తగ్గినా కొన్ని గ్రామలు మాత్రం ఆ ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. ఎంతో మంది బాధితులు కంటనీరు పెడుతూనే ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలు వాళ్ల కష్టాన్ని అర్ధం చేసుకుని వాళ్లకి సాయం చెయ్యడానికి ముందుకొచ్చారు. కొంతమంది డబ్బుని ఇచ్చారు, మరి కొంతమంది నివాసం ఇచ్చారు, ఇంకొకరు అన్నం పెట్టి ఆదుకున్నారు, మరొకరు అండగా నిలబడ్డారు. ఎవరికి వాళ్లు వాళ్లకి తోచిన విధంగా సాయం చేశారు.

వరదలు సంభవించిన వెంటనే ముందు 25 లక్షలు విరాళం ప్రకటించిన సూర్య ఇప్పుడు మళ్ళీ వరదల తాకిడికి దెబ్బ తిన్న మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. తిరువళ్లూర్‌ అనే జిల్లాలో నెల్వర్‌, కచూర, కెంగంబాక్కం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాల్లో నివసించిన ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులతో సహా సర్వం పోగొట్టుకున్నారు. దీనితో వారికి ప్రభుత్వం ఇచ్చే సహాయం అందక ఎంతో నరకం చవిచూస్తున్నారు. వాళ్ల పరిస్ధితి తెలుసుకున్న సూర్య తన అగరం ఫౌండేషన్‌ ద్వారా ఈ మూడు గ్రామలకి తన వంతు సాయం చేస్తున్నాడు.


English summary

Hero Surya adopted three villages in Tamil Nadu Thiruvallur Distict.