హీరో తనీష్ ఇంట్లో విషాదం

Hero Tanish father was expired today

10:03 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Hero Tanish father was expired today

దేవుళ్లు, మన్మధుడు సినిమాల్లో బాలనటుడిగా నటించిన తనీష్.. ఆ తరువాత 'నచ్చావులే' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత రైడ్, మౌనరాగం, ఏం పిల్లో ఏం పిల్లాడో, కోడిపుంజు, మంచివాడు, మేం వయసుకు వచ్చాం, తెలుగబ్బాయి, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే ప్రస్తుతం తనీష్ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. తనీష్ తండ్రి వర్ధన్ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్ మెంటులో తనీష్ కుటుంబం నివాసం ఉంటుండగా.. తమ ఫ్లాట్ లోని రెయిలింగ్ వద్దకు వచ్చిన ఆయన.. అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయారు.

వారి నివాసం 6వ అంతస్తులో ఉండడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో చికిత్స నిమిత్తం అర్ధరాత్రి వెంటనే ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైధ్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. దీనితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే వర్ధన్ మృతి కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది. వర్ధన్ జారి పడలేదని ఆత్మహత్యాయత్నం చేశారని కుడా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary

Hero Tanish father was expired today. Tollywood hero Tanish father was expired today morning.