జబర్దస్త్ ఆదిని చంపెయ్యమని చెప్పిన అగ్రహీరో

Hero told to kill Jabardhasth comedian Aadhi

12:51 PM ON 6th February, 2017 By Mirchi Vilas

Hero told to kill Jabardhasth comedian Aadhi

ఇదేమిటి అనుకున్నారా ఇది నిజమేనట. ఇంతకీ విషయం ఏమంటే, జబర్దస్త్ కామెడీ షోతో విశేషంగా ఆకట్టుకుని ప్రేక్షకులకు హైపర్ ఆది బాగా దగ్గరయ్యాడు. అయితే.. హైపర్ ఆదిపై టాలీవుడ్ అగ్రహీరో ఆగ్రహంగా ఉన్నాడట. ఆ అగ్రహీరో బాలకృష్ణట. ఇంతకీ బాలకృష్ణకు కోపమొచ్చేంత పెద్ద తప్పు ఆది ఏం చేశాడు? అంటే.. బాలయ్య తండ్రి నందమూరి తారకరామారావుపై ఆది ఇదివరకు ఓ స్కిట్ చేశాడట. అందులో ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట. అదే బాలయ్యకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందట. దీంతో వెంటనే బాలయ్య తన పీఏను పిలిపించి.. ఆదిని చంపెయ్ అని చెప్పాడట. అది సోషల్ మీడియాలో రూమర్గా వైరల్ అయ్యింది. ఆదికి ఫోన్ చేసిన బాలయ్య పీఏ.. ‘బాలకృష్ణగారు మిమ్మల్ని చంపేయమన్నాడు.. చంపేయాలా?’ అని అడిగాడట. దీంతో కంగారు పడిన ఆది.. ఆ తప్పు మరోసారి చేయనని అన్నాడట. ఇక, వెంటనే స్పందించిన బాలయ్య పీఏ.. అదంతా బాలయ్య సరదాగా అన్నాడని అసలు విషయం చెప్పాడట. దీంతో ఆది ఊపిరి పీల్చుకున్నాడట. ఇది ఎవరో చెప్పింది కాదండి బాబూ ఈ విషయాలన్నిటినీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆది చెప్పడం విశేషం. భలే వుంది కదా.

ఇది కూడా చూడండి: తరచూ ఆవలింతలు రావడం మంచిదా? చెడ్డదా?

ఇది కూడా చూడండి: స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన అపురూప విషయాలు

English summary

Tollywood hero Balakrishna told his PA to kill Jabardhasth comedian Aadhi.