అన్నగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నహీరో విశాల్

Hero Vishal helped one family

04:48 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Hero Vishal helped one family

ఈ మధ్య ఈ హీరో వీరలెవెల్లో సహాయక కార్యక్రమాల్లో ముందుంటున్నాడు. ఈమధ్యే తన పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు ఉంగరాలు ప్రెజెంట్ చేసిన ఈ హీరో తాజాగా ఓ ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూతనిచ్చాడు. అతనెవరో కాదు హీరో నడిగర్ సంఘం కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్... వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల నగరంలో మద్యం సేవించి ఉన్న ఓ కారు డ్రైవర్ వేగంగా కారు నడపడంతో 13 ఆటోలు ధ్వంసం కాగా, ఆటోలో విశ్రాంతి తీసుకుంటున్న తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి తాలూకా అక్కూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆర్ముగం(28) సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. దీంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. భర్త సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం నేడు ఆకలితో దిక్కుతోచని స్ధితిలో ఉంది.

ఈ విషయం తెలుసుకున్న విశాల్ ఆర్ముగం కుటుంబసభ్యులను పరామర్శించి తన సానుభూతి తెల్పాడు. ఆర్ముగం కుమార్తె మనీషా(7) చదువుకయ్యే ఖర్చును ఒక అన్నయ్యగా భావించి తానే పూర్తిగా భరించనున్నట్లు ప్రకటించాడు. అంతేకాక దానికి సంబంధించిన కార్యచరణ కూడా ప్రారంభించారు. అంతేకాక ఆ కుటుంబ పోషణకు ఏదైన ఒక కిరాణ షాపు ఏర్పాటు చేసేలా చూస్తానని విశాల్ హామీ కూడా ఇచ్చాడు. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే తెలుగు వాడైన విశాల్ ను తమిళులు ఆరాధిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అందాలు ఒలికించే ముద్దుగుమ్మలే... అయినా భయపెట్టేసున్నారు

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే ఏ అమ్మాయైనా మీకు పడాల్సిందే!

ఇది కూడా చదవండి: గుండెనొప్పి ఎక్కువగా ఏ సమయంలో వస్తుందో తెలుసా?

English summary

Hero Vishal helped one family