ఘాటింగ్‌లో నిజంగా కొట్టుకున్న హీరోలు

Heroes fighted really in shooting

04:17 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Heroes fighted really in shooting

రంగం ఫేమ్‌ జీవా, సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్ ఇద్దరూ 'పోక్కిరి రాజా' అనే సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. స్వతహాగా వీరిద్దరూ మంచి స్నేహితులు, అయితే వీరిద్దరి మధ్య ఏవో గొడవలు తలెత్తాయట. ఇంతకు ముందులా వీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడంలేదట. అయితే సినిమా కోసం గొడవని పక్కన పెట్టి వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఘాటింగ్‌ లో జీవా-శిబిరాజ్‌ల మధ్య ఒక ఫైటింగ్‌ సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. ముందు జీవా శిబిరాజ్‌ని కొట్టాలట. ముందు సినిమాలోలాగే గాల్లో కొట్టాడట జీవా, కానీ దర్శకుడు మరో టేక్‌ అని చెప్పాడట. దీంతో ఇది వరకు తన పై ఉన్న కోపాన్నంతా గుర్తు తెచ్చుకుని నిజంగానే శిబిరాజ్‌ని జీవా కొట్టాడట.

దాంతో శిబిరాజ్‌ వెంటనే పెద్ద గొడవ చేసి ఆ ఘాటింగ్‌ నుంచి వెళ్లిపోయాడట. ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటింగ్‌ మొదలవుతుందా లేదా అనే సందిగ్ధంలో నిర్మాతలు, దర్శకుడు పడిపోయారు.

English summary

Hero Jeeva beats really hero Sibiraj really in Pokkiri Raja shooting spot. Sibiraj is Sathyaraj's son.