రైతుని మోసం చేసిన హీరోయిన్ రమ్య

Heroine and Mp Ramya cheated farmer family

04:08 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Heroine and Mp Ramya cheated farmer family

నటి ఏమిటి, మాట తప్పటం ఏమిటి, దీనికి రైతు భార్య ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటి అనే ప్రశ్నలు రావడం సహజం. కానీ ఆమె నటే కాదు, మాజీ ఎంపి కూడా... ఎవరంటే కన్నడ నటి, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రమ్య... ఈమె తరచూ వార్తల్లో ఎక్కుతూ వుంటుంది. తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని వారి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుని భరిస్తానని గతంలో మాట ఇచ్చిన రమ్య ఆ మాట నిలబెట్టుకోలేదని రైతు భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గతేడాది అక్టోబర్‌ 9న లోకేశ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

అతని కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించి, మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం చేయాలని రాహుల్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. రాహుల్‌ గాంధీతో పాటు రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఆ ప్రాంత మాజీ ఎంపీ రమ్య వారి కుటుంబాన్ని ఆదుకుంటానని ముందుకు వచ్చింది. మృతుడి ఇద్దరు పిల్లలు స్మిత, సాగర్‌ల విద్యకు అయ్యే ఖర్చును తనే భరిస్తాననడంతో ఈ విషయం పై రమ్య ను అప్పట్లో రాహుల్‌ అభినందించారు. అయితే ఈ విషయాన్ని రైతు లోకేశ్‌ భార్య శోభ ప్రస్తావిస్తూ, రమ్య ఇప్పటివరకు తమ కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని, పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారమూ అందలేదని వాపోయింది.

ఇది కూడా చదవండి: కైరో విమానం హైజాక్‌(వీడియో)

గ్రామస్థులు కూడా ఈ విషయం గురించి రమ్య పై మండిపడ్డారు. రమ్య కేవలం పబ్లిసిటీ కోసమే అలా ప్రకటించారని.. రాహుల్‌గాంధీ దగ్గర మెప్పు పొందడానికే తప్ప పేద ప్రజల పట్ల సానుభూతితో కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదండీ సంగతి.. రాజకీయాల్లో మాటలకు అర్ధాలే వేరులే అంటే ఇదే...

English summary

Heroine and Mp Ramya cheated farmer family. Kannada actress Ramya and Ex MP cheated farmer family.