నన్ను సరిగా వాడుకోలేదు!

Heroine Archana didn't get good opportunities from telugu directors

06:52 AM ON 15th December, 2015 By Mirchi Vilas

Heroine Archana didn't get good opportunities from telugu directors

'తపన' చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన తెలుగు బ్యూటీ అర్చన(వేద శాస్త్రి) ఆ తరువాత అల్లరి నరేష్‌ నటించిన 'నేను' చిత్రంలో అందం, నటన ప్రధాన్యం ఉన్న పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో నటించినా సరైన బ్రేక్‌ ఇచ్చిన సినిమాల్లో మాత్రం నటించలేకపోయింది. కావల్సిన అందం, ఒంపుసొంపులు, నటన మెండుగా అర్చనలో ఉన్న ఎవరూ సరిగా ఉపయోగించుకోలేదు. అర్చన 2013లో నటించిన 'కమలతో నా ప్రయాణం' చిత్రంలో వేశ్యగా కనిపించి అందాలు విపరీతంగా ఆరబోసింది. ఈ చిత్రంతో అయినా మంచి బ్రేక్‌ వస్తుంది అనుకుంటే అబ్బే లాభం లేక పోయింది.

ఇంత అందం, నటన ఉన్నా సరైన అవకాశం ఎందుకు రావడం లేదని ఆమెని అడిగితే లోకల్‌ (తెలుగు) హీరోయిన్స్‌ను ఎవరూ ప్రోత్సహించరు, అందరరికీ ముంబై, ఢిల్లీ నుండి ఇంపోర్ట్‌ హీరోయిన్స్ కావాలి అంటూ తన మనసులో మాట బయట పెట్టింది అర్చన. అర్చనంత అందం, నటన లేని ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్‌ ని ఏలుతున్నారు అనడంలో తప్పులేదు.

English summary

Heroine Archana didn't get good opportunities from telugu directors. That's why she do not get nice brake through.