ఇంతకీ వీళ్లల్లో 'సావిత్రి' ఎవరు?

Heroine confusion for Savitri biopic movie

05:01 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Heroine confusion for Savitri biopic movie

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే సావిత్రి పాత్రని పోషించగల నటి ఎవరనే విషయం దగ్గరే చిక్కొచ్చిపడింది. కొంతకాలంగా ఆ నటి గురించే చిత్రబృందం అన్వేషిస్తోంది. పలువురు బాలీవుడ్ కథానాయికల పేర్లని కూడా పరిశీలించిన తర్వాత నిత్యా మీనన్ అయితేనే బాగుంటుందని మొదట్లో నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ... ఇప్పుడు అనుష్క పేరు తెరపైకొచ్చింది. నిత్య ఓకే చెప్పినప్పటికీ చిత్రబృందం మాత్రం అనుష్కని సంప్రదించే పనిలో పడ్డారట.

అయితే అనుష్క ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ దశలో ఆమె సినిమా ఒప్పుకొంటుందా అన్నదే ప్రశ్న. నిత్య, అనుష్కలలో సావిత్రి ఎవరన్నది మరికొన్ని రోజులు ఆగితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. మహానటి సావిత్రి కళ్ళతోనే భావాలు పలికిస్తూ అద్భుత నటనతో ఆనాటి ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాంటి నటిగా మెప్పించే పాత్ర ఎవరికీ దొరికినా వారు ధన్యులే.

ఇది కూడా చదవండి: పవన్ స్పీచ్ కోసం కవిత తహ తహ!

ఇది కూడా చదవండి: 'బ్రహ్మోత్సవం' అక్కడ 100 రోజులు ఆడిందట!

ఇది కూడా చదవండి: ఒకనాడు ఒలింపిక్స్ ఛాంపియన్.. ఇప్పుడు పూరీలు అమ్ముకుంటోంది!

English summary

Heroine confusion for Savitri biopic movie. Heroine is not finalised for great actress Savitri biopic movie. Director and producer are considering Nithya Menon and Anushka for Savitri role.