కమల్ తో తెగతెంపులు... బహిరంగ లేఖతో తేల్చేసిన గౌతమి!

Heroine Gouthami break up with Kamal Hassan

06:21 PM ON 2nd November, 2016 By Mirchi Vilas

Heroine Gouthami break up with Kamal Hassan

సినిమావాళ్ళ బంధాలు అనుబంధాలుగా మారినా, అవి ఎన్నాళ్ళో ఉండవని తాజాగా కమల్ హాసన్, గౌతమిల ఘటన రుజువు చేస్తోంది. కమల్ - నేను విడిపోయాం అంటూ ఆమె అభిమానులకు బహిరంగ లేఖ రాసింది. ఆలేఖ ఇదే. నేనూ, మిస్టర్ హాసన్ ఇక కలిసుండం. ఈ మాట చెప్పాల్సి రావడం చాలా బాధాకరంగా ఉంది. 13 ఏళ్లు కలిసి ఉన్నాం. నా జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిది. కమిటెడ్ రిలేషన్ షిప్ లో మన కలలే ముఖ్యమని అనుకోవడం లేదా వాటిని కాదని జీవితంలో రాజీ పడటం ఉంటుంది. దీనిలో ఏది ఎంచుకోవాలో తేల్చుకోవడం ఎవరికైనా అంత సులభం కాదు. హృదయం బద్దలయ్యే నిజం అంగీకరించడానికి, ఈనిర్ణయం తీసుకోవడానికి చాలా సమయమే పట్టింది.

1/4 Pages

ఇందువల్ల సానుభూతి పొందాలనో, ఒకర్ని తప్పుపట్టాలనో నా ఉద్ధేశం కాదు. నా జీవితాన్ని నేను అర్థం చేసుకున్నా. మార్పు అనేది మానవ సహజం. నేను మొదట తల్లిని. సాధ్యమైనంత వరకు నా బిడ్డకు బెస్ట్ మదర్ గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకు నాతో నేను ప్రశాంతంగా ఉండాలి. నేను చిత్ర పరిశ్రమలోకి రాకముందు, వచ్చిన తర్వాత మిస్టర్ హాసన్ కు పెద్ద అభిమానిని అనడంలో పెద్ద రహస్యం లేదు.

English summary

Heroine Gouthami break up with Kamal Hassan