సెట్ లో నే పెళ్లి అయిపొయింది

Heroine Jacqueline And Kapil get married On The Kapil Sharma Show

11:05 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Heroine Jacqueline And  Kapil get married On The Kapil Sharma Show

అవును నిజం. ఎక్కడో పెళ్లి చేసుకుంటే, ఏమిటి అనుకున్నారో ఏమో సెట్ లోనే బాలీవుడ్ హీరోయిన్ జాక్విలైన్ ఫెర్నాండెజ్.. కామెడియన్ కపిల్ శర్మ మ్యారేజ్ చేసేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కపిల్ ఎంత అదృష్టవంతుడని కొందరంటే.. జాక్విలైన్ కాలం కలిసొచ్చిందని మరికొందరు ఇలా రకరకాల సెటైర్లు పడిపోతున్నాయి. కానీ ఈ పెళ్లి స్టోరీలోకి వెళ్తే వివరాలిలా వున్నాయి.

వాస్తవానికి ఇదంతా నిజంగా జరిగిన పెళ్లి కానే కాదు.. కపిల్ శర్మ కామెడీ షోకి అటెండైన హీరోయిన్ జాక్విలైన్.. శర్మను పెళ్లి చేసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించింది. అనుకున్నదే తడవుగా సెట్లో ఇద్దరు దండలు మార్చుకుని ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోను కపిల్ శర్మ తన ట్విట్టర్ పేజీలో పెట్టాడు. తనను సంతోషంగా ఉంచుతానని జాక్విలైన్ మాట ఇచ్చిందని, షాపింగ్ కు, అవుట్ డోర్ కు తీసుకెళ్తానని చెప్పిందని అందులో రాసుకొచ్చాడు. ఇంకాలోతుకి వెళ్తే.. జాక్విలైన్ నటించిన ‘ది ఫ్లైయింగ్ జాట్’ మూవీ ప్రచారం కోసం కామెడీ షోకి వచ్చింది. సినిమా ప్రచారం పక్కనబెడితే.. జాక్విలైన్ మాత్రం మ్యారేజ్ పేరిట హైలైట్ అయ్యింది. మొత్తానికి ఈ పెళ్లి రియల్ కాదు రీల్ కాదు భలే కామెడీగా వుంది కదా.

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

English summary

Heroine Jacqueline And Kapil get married On The Kapil Sharma Comedy Show