35ఏళ్ళ వయసులో పెళ్లి కూతురైన నిఖిత.. పెళ్లి డేట్ ఫిక్స్!

Heroine Nikitha marriage was fixed

01:09 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Heroine Nikitha marriage was fixed

'హాయ్' మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ర్టీలో ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ నిఖిత, ఈ మధ్యకాలంలో తమిళం, కన్నడలో సినిమాలు చేసినా సరైన బ్రేక్ రాలేదు. దీంతో మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో హాయిగా సెటిలైపోవాలని ప్లాన్ చేసుకుంది. ఆమె అనుకున్నట్టుగానే ముంబైకి చెందిన బిజినెస్ మేన్ గగన్ దీప్ సింగ్ తో మ్యారేజ్ కి రెడీ అయ్యింది. అన్నట్లు గగన్ సింగ్ ఎవరంటే, కాంగ్రెస్ నేత మహీందర్ సింగ్ కి కుమారుడే. గురువారం నుంచి మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇక శనివారం మ్యారేజ్ జరగనుంది. ఈ ఫంక్షన్ కి ఇరు కుటుంబాలతోపాటు రాజకీయ, సినీ ఇండస్ర్టీలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇంతకీ గగన్ దీప్ తో నిఖితకు రిలేషన్ ఎలా ఏర్పడింది? గతేడాది డిసెంబరులో తన కజిన్ పెళ్లిలో గగన్ ని కలిశానని, అప్పుడే లవ్ లో పడినట్టు నిఖిత చెప్పుకొచ్చింది. నేను హోమ్లీగా ఉండడంతో అతడు నన్ను ప్రేమించాడు అని నిఖిత అంటోంది. ఇందులో భాగంగానే ముంబైలోని రెస్టారెంట్ లో మోకాలిపై నిలబడి డైమండ్ రింగ్ తో గగన్ తనకు లవ్ ప్రపోజ్ చేశాడంటూ మనసులోని మాట బయటపెట్టింది. తన కోసం వాళ్ల ఇంట్లో స్పెషల్ గా ఓ పూజ గదిని ఏర్పాటు చేశాడని అంటోంది. తనకు కాబోయే భర్త గగన్ అని, అతడు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనని తెలిపింది.

ఇది కూడా చదవండి: అద్భుతం: సెక్స్ చేస్తే జలుబు తగ్గుతుందట.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: ప్రెగ్నెంట్ అయిన మొదటి 3 నెలలు కచ్చితంగా పాటించవలసిన నియమాలు

ఇది కూడా చదవండి: ఆడవాళ్ళకు బట్టతల ఎందుకు రాదో తెలుసా?

English summary

Heroine Nikitha marriage was fixed. Nikita Thukral marriage was fixed with Gagan Singh. It is love and arranged marriage.