హీరో నానిని కమల్ తో పోల్చేసింది

Heroine Niveda Thomas heart core fan of Nani

11:10 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Heroine Niveda Thomas heart core fan of Nani

మరో హిట్ అందుకున్న హీరో నానిని హీరోయిన్ నివేదా థామస్ ఏకంగా పాపులర్ స్టార్ కమల్ హసన్ తో పోల్చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ నటి హైదరాబాద్.. చెన్నై మధ్య షూటింగుల నిమిత్తం ట్రిప్పులు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ‘జెంటిల్ మన్’ చిత్రంలో ఈ హీరోతో కలిసి నటించిన ఈ అమ్మడు.. కమల్ తర్వాత నాని నేచురల్ స్టార్ అని అభివర్ణించింది. ‘జెంటిల్ మన్’ మూవీ తనకు మరపురాని అనుభూతిని మిగిల్చిందని తెలిపింది. ‘నేను నాని హార్డ్ కోర్ అభిమానిని. అతని మొదటి చిత్రం ‘అష్టా చెమ్మా’ నుంచి ఈ హీరో నటించిన అన్ని సినిమాలు చూశా. తమిళ మూవీ వెప్పంలో నాని యాక్టింగ్ సుపర్బ్’ అని నివేదా థామస్ పేర్కొంది.

చైల్డ్ ఆర్టిస్టుగా 2008లో తెరంగేట్రం చేశానని నివేద చెబుతూ, అప్పుడే నాని మొదటి చిత్రం కూడా వచ్చిందని గుర్తు చేసింది. టాలీవుడ్ లో మంచి మంచి స్క్రిప్టులతో సినిమాలు వస్తున్నాయి.. అందుకే ఇక్కడ సినిమాలు చేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నా నని తెలిపింది.

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: ఐపీఎల్ లో క్రికెటర్ల జీతాలు చూస్తే షాకవ్వల్సిందే

ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మీకు తెలియని విషయాలు

English summary

Heroine Niveda Thomas heart core fan of Nani.