నన్ను చంపేస్తారు అంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

Heroine Poojitha faces Life Threat from Her Husband

10:54 AM ON 11th May, 2016 By Mirchi Vilas

Heroine Poojitha faces Life Threat from Her Husband

అవునా , అవుననే విధంగా, నటి పూజిత మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది . తన భర్త విజయగోపాల్ విడాకులు తీసుకోకుండా ఐఏఎస్ అధికారిణి రేఖారాణి ని పెళ్లిచేసుకున్నాడంటూ పూజిత వారం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం, నానా రాద్ధాంతం జరగడం తెలిసిందే. తాజాగా తన భర్త, రేఖారాణి కల్సి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పూజిత పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా పూజిత తన ఐడీ ప్రూఫ్, ఇతర వివరాలను పోలీసులకు సమర్పించింది. తనకు తన కుమారుడికి తగిన న్యాయం జరిపించాలని పోలీసులను అభ్యర్థించింది. అయితే, తాను పూజిత‌ను అసలు పెళ్లే చేసుకోలేద‌ని విజయ్ గోపాల్ అంటున్నాడు. ఆమెతో సుమారు 12ఏళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేశానని, గ‌త ఏడేళ్ల నుంచి పూజిత‌కు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. తమ ఇరువురికి ఒక కొడుకు ఉన్నాడని అంటున్నాడు. అటు రేఖారాణి కూడా భర్త విజయ్ గోపాల్ మాటలు వాస్తవమేనంటోంది . తాను అన్నీ చూసుకున్న తర్వాతనే విజయ్ గోపాల్ ని పెళ్లి చేసుకున్నానంటోంది. పూజిత-విజయ గోపాల్ పెళ్లి చేసుకోలేదని ఆవిడ చెబుతోంది.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:అ..ఆ..ని వెంటాడుతున్న బ్రహ్మోత్సవం

ఇవి కుడా చదవండి:అబ్బా , 8 నెలలుగా రెస్ట్ లేదంటున్న సమంత

English summary

Veteran Heroine Poojitha faces life threat from her husband . She complained in Police station that there was life threat from her husband . She says that her husband married her and later left her and Married to another IAS officer.