విడాకులకి దారి తీసిన 'ప్రేమ' పెళ్లి

Heroine Prema To Take Divorce

12:31 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Heroine Prema To Take Divorce

విక్టరీ వెంకటేష్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ధర్మచక్రం' సినిమాలో వెంకీ సరసన నటించిన ప్రేమ కన్నడ నుండి దిగుమతయింది. తెలుగులో మొదటి చిత్రమే అయినా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ప్రేమ. ఆతరువాత కోరుకున్న ప్రియుడు, అత్తా నీ కొడుకు జాగ్రత్త, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన ప్రేమ ఆ తరువాత కోడి రామకృష్ణ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'దేవి' లో హీరోయిన్‌గా నటించిన ప్రేమ ఈ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగిపోయింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించిన ప్రేమ స్టార్‌ హోదా ఉండగానే 2006 సంవత్సరంలో జీవన్‌ అప్పచ్చు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత ఢీ, కృష్ణార్జున వంటి సినిమాల్లో నటించిన ప్రేమ ఇంక శాశ్వతంగా సినిమాలకి దూరమైంది. ఆ తరువాత మీడియాకి కూడా దూరంగా ఉంది. పెళ్లయ్యాక న్యూజిలాండ్‌లో కాపురం పెట్టిన ప్రేమ కొంతకాలం క్రితమే బెంగుళూరు వచ్చి స్థిరపడింది. అయితే ఇప్పుడు తన భర్త ప్రవర్తన నచ్చకపోవడంతో విడాకులకి అప్లై చేసింది. ఈ విషయాన్ని ప్రేమ స్వయంగా మీడియాకి తెలియజేసింది.

అంతేకాదు 'శ్రీమంతుడు' చిత్రంలో నటించే అవకాశమొస్తే తానే తిరస్కరించానని వెల్లడించింది. 'శ్రీమంతుడు' దర్శకుడు కొరటాల శివ తన వద్దకి వచ్చి కధ వినిపించి మహేష్‌కి తల్లి పాత్రలో నటించాలని చెప్పారు. నాకు నచ్చకపోవడంతో ఆ అవకాశాన్ని తిరస్కిరించాను. అయితే మంచి కధలతో వస్తే సినిమాల్లో నటించడానికి నేను సిద్దమే అని ప్రేమ తన మనసులో మాటని బయట పెట్టింది.

English summary

Veteran Top Heroine Prema has loved Jeevan Appachu and she married in the year 2006 to Jeevan Appachu.After her marriage she went to New Zealand.Few years ago she settled in Banglore and now she committed to take divorce from her husband for some personnel problems.