అలనాటి అందాల తార రాధా 25వ వెడ్డింగ్ యానివర్సరీ(ఫోటోలు)

Heroine Radha 25th wedding anniversary photos

01:20 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Heroine Radha 25th wedding anniversary photos

సినిమాల్లో హీరోయిన్లలో ఒక్కక్కరిదీ ఒక్కో స్టైల్. ఇక నిన్నటి తరం మేటి నాయిక రాధ డాన్స్ లో సూపర్బ్, అందుకే ఈమె డ్యాన్సులంటే యూత్ కి ఊపొచ్చేసేది. డ్యాన్సులు చేస్తే రాధలానే చేయాలి అనేంతగా పాపులర్ అయింది. అయితే రాధ వివాహానంతరం సినిమాలకు దూరమయినా, కూతురిని ఫీల్డ్ లోకి తెచ్చింది. ఇక లేటెస్టుగా వెడ్డింగ్ యానివర్శరీతో మరోసారి చర్చల్లోకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించి మెగా నాయికగా పాపులర్ అయిన మేటి నాయిక రాధ అందాల కథానాయిక కూడా... తెలుగువారి అభిమాన నాయిక రాధ కెరీర్ పీక్స్ లో ఉండగానే నిర్మాత రాజశేఖరన్ ని వివాహమాడిన సంగతి తెలిసిందే.

1/4 Pages

ఆ తర్వాత రాధ ముఖానికి రంగేసుకోవడం మానేశారు. మధ్యలో కొన్ని బుల్లి తెర కార్యక్రమాల్లో దర్శనమిచ్చినా.. పరిమితంగానే కనిపించారు. రాధ గారాల తనయలు కార్తీక, తులసి నాయర్ కథానాయికలుగా కోలీవుడ్, టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి బాధ్యతల్ని తల్లిగా తానే దగ్గరుండి చూసుకున్నారు. కూతుళ్ల కెరీర్ కోసం ఎంతగానే పాకులాడారు. రాధ రాజశేఖరన్ 25వ వెడ్డింగ్ యానివర్శరీ తిరువనంతపురంలోని ఓ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు కొద్దిమంది బంధు మిత్రులు మాత్రమే ఎటెండ్ అయ్యారు. చాలా సింపుల్ గా పిలిచినా, రిచ్ గానే ఈ వేడుక జరిగిందని అంటున్నారు.

English summary

Heroine Radha 25th wedding anniversary photos. Hot heroine Radha 25th wedding anniversary photos.