భర్త నుంచి నెలకు రూ.2.5లక్షలు కోరిన రంభ..

Heroine Rambha asking 2.5 lakhs per month from her husband

04:35 PM ON 27th October, 2016 By Mirchi Vilas

Heroine Rambha asking 2.5 lakhs per month from her husband

సినిమా వాళ్ళ పెళ్లిళ్లు ఎలా మలుపు తిరుగుతాయో, తీరా పెళ్లయ్యాక ఎలాంటి మార్పులకు లోనవుతారో పలు ఘటనలు రుజువుచేస్తున్నాయి. తాజాగా అలనాటి స్టార్ హీరోయిన్ రంభ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కెనడాలో ఒక ఫ్యాక్టరీకి యజమానిగా ఉన్న పి.ఇంద్రకుమార్ ని రంభ పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు వున్నారు. కెనడా నుంచి పిల్లలతో సహా వచ్చేసి, చెన్నైలో ఉంటోంది. అయితే భర్తతో తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ మంగళవారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సినీనటి రంభ బుధవారం దీనికి అనుబంధంగా మరో పిటిషన్ వేసింది.

హిందూ వివాహ చట్టం ప్రకారం తనకు భర్త నుంచి నెలకు రూ.2.5 లక్షలు జీవన భృతిగా ఇప్పించాలన్నది ఆ పిటిషన్ సారాంశం. తనకు నెలకు రూ.1.5 లక్షలు, తన ఇద్దరు మైనర్ కుమార్తెల బాగోగుల కోసం చెరో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2.5 లక్షలు ఇప్పించాలని ఆమె కోరింది.

1/4 Pages

పెళ్లికి ముందు నటిగా ఉన్నందున ఆదాయం ఉండేది. పెళ్లి తర్వాత తనకు ఆదాయమార్గం లేకుండా పోయింది అని ఆమె తన పిటిషన్ లో ప్రస్తావించారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం దాదాపు మానేశానని, తనతో పాటు తన పిల్లల పోషణకు తగిన ఆదాయం లేదని ఆమె పేర్కొన్నారు.

English summary

Heroine Rambha asking 2.5 lakhs per month from her husband