హీరోయిన్ పై కోడి గుడ్లతో దాడి !

Heroine Ramya Attacked With Eggs

10:40 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Heroine Ramya Attacked With Eggs

అవునా అంటే అవునని అంటున్నారు. పైగా హీరోయిన్ మాత్రమే కాదు ఈమె మాజీ ఎంపీ కూడా. వివరాల్లోకి వెళ్తే, పాకిస్థాన్ కు అనుకూలంగా మాజీ ఎంపీ - నటి రమ్య వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది. శాంతి కోసమే పాకిస్థాన్ వెళ్లి వచ్చానని చెప్పిన రమ్యకు మంగళూరులో చేదు అనుభవం ఎదురైంది. మంగళూరు విమానాశ్రయం బయట ఆమెపై దాడికి కొంతమంది ప్రయత్నించారు. వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రమ్యపై గుడ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. రమ్యపై ఇలా దాడి చేసినవారెవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశ్వ హిందూ పరిషత్ పనేనని కొంతమంది అనుమానిస్తుంటే, వారితోపాటు - భజరంగ్ దళ్ కు చెందినవారు కూడా ఆందోళనకారుల్లో ఉండే అవకాశం ఉందని మరికొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్నవారిని విచారించాక కారకులు ఎవరో చెబుతామని పోలీసులు చెబుతున్నారు. ఇక రమ్యకు సంబంధించిన ప్రతీ వార్తపైనా పాకిస్థాన్ ఆసక్తికరబరుస్తూ ఉందట.

తమకు అనుకూలంగా ఎవ్వరు మాట్లాడినా విశేష ప్రాధాన్యత ఇచ్చేయడం పాక్ మీడియాకి బాగా అలవాటైపోయింది. నటి రమ్య విషయమే చూడండి... పాకిస్థాన్ కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయగానే అక్కడ సెలెబ్రిటీ అయిపోయారు! రమ్యను పాక్ మీడియా తెగ మోసేస్తోంది. ది డాన్ - నేషన్ ఇంగ్లిష్ - జంగ్ వంటి ప్రముఖ ఉర్దూ పత్రికలు రమ్యకు ఫస్ట్ పేజీల్లో ప్లేసులు ఇస్తున్నాయి. రమ్య విషయంలో జరుగుతున్న ప్రతీ డెవలప్ మెంట్ నూ రాసేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇండియావైపే చూస్తోంది. కొందరు అభిప్రాయపడుతున్నట్టుగా పాకిస్థాన్ నరకం కాదనీ అక్కడ కూడా ప్రజలు మనలానే ఉంటున్నారనీ మనల్ని బాగా చూసుకుంటున్నారనీ రమ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెప్పేది లేదని కూడా ఆమె తెగేసి చెప్పేసింది. దీంతో కర్ణాటకలోని కొడుగలో ఒక న్యాయవాది రమ్యపై దేశద్రోహం కేసుపెట్టారు. అయినా వదలకుండా రమ్యకు సంబంధించిన ప్రతీ వార్తానూ పాక్ గమనించడం అనుమానాలకు తావిస్తోంది. ఓ విధంగా అక్కడ ఆమెని నెత్తిన పెట్టుకుని మోస్తుంటే, మనదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. పాపం రమ్య ఇరుక్కుపోయిందనే మాటలూ వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:కష్టపడకుండా బరువుని తగ్గించే అద్భుత చిట్కాలు!

ఇవి కూడా చదవండి:తనకి జాబ్ వచ్చిందని లవర్ కి చెప్తే ఫోన్ కొనివ్వమంది.. కానీ ఇంతలోనే..

English summary

Veteran Heroine and Ex-Member of parliament Ramya made some controversial comments on Pakistan by saying that Indians can live without any problem in Pakistan like India. She Praised Pakistan and due to that one of the Advocate in Karnataka filed a petition in court also. Recently some of the people gathered and thrown eggs on her Convoy.