అవకాశం ఇస్తే దేనికైనా రెడీ అంటున్న ప్రముఖ నటి

Heroine ready to do anything for chance

11:28 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Heroine ready to do anything for chance

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం వంటివి చాలవు. అందుకే నటీనటులు అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తారు, ఏ పని చేసేందుకు అయినా సిద్ధ పడతారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారు అవకాశాల కోసం అర్రులు చాచుకుని కూర్చుంటారు. ఇక హీరోయిన్స్ అయితే ఒకటి రెండు సినిమాల్లో నటించిన తర్వాత అవి సక్సెస్ కాకపోతే అవకాశాల కోసం ఏం చేసేందుకు అయినా వెనుకాడరు. ఏమి చేయడానికైనా రెడీ అయిపోతారు. కొందరు హీరోయిన్స్ గ్లామర్ షోకు సిద్ధం అయితే మరి కొందరు ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు ముందుకు వస్తారు. ఇక మరి కొందరు అడ్డ దారుల్లో సైతం హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు.

గత సంవత్సరం రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందిన ఓ హీరోయిన్ మరిన్ని అవకాశాలను మాత్రం తెచ్చుకోలేక పోయింది. అవకాశాల కోసం ఎంతో ప్రయత్నం చేసినా సదరు హీరోయిన్ చివరి ప్రయత్నంగా ఒక దర్శకుడికి శరీరం సైతం అప్పగించేందుకు సిద్ధం అయ్యింది. అందుకే అన్నీ అర్పిస్తాను, ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్దం అంటూ ఆఫర్ ఇచ్చింది. అందుకు ఆ దర్శకుడు ఎలా స్పందించాడో చెప్పలేంకాని, మొత్తానికి ప్రస్తుతం ఈ టాపిక్ టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాలు బహిర్గతం కాలేదు.

అవకాశాల కోసం హీరోయిన్స్ కూడా ఇలా చేయడం చూస్తే వారు ఎంతగా సినిమా పిచ్చిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమా మోజులో పడి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అనుకోవాలా, పోటీ ప్రపంచంలో అన్నీ వదిలేస్తేనే ముందుకు వెళ్తామని కాన్సెప్ట్ డవలప్ చేసుకుంటున్నారో తెలియని విచిత్ర పరిస్థితి ఇది.

English summary

Heroine ready to do anything for chance