నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ పద్దతైనోడే

Heroine Shruti Haasan talks about her First Boyfriend

12:41 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Heroine Shruti Haasan talks about her First Boyfriend

సినిమా వాళ్ళన్నాక ఎఫైర్ మామూలే ... ఇందులో కొందరు దాపరికం పాటిస్తే మరికొందరు పబ్లిక్ అవుతారు. ఏమాత్రం భయపడరు. ఇదిగో అందాలు ఆరబోసే, శృతి హాసన్ కూడా ఆకోవలోకి వస్తుంది. మామూలుగా మన హీరోయిన్లు తమ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటేనే నోరు విప్పరు. బాలీవుడ్ మాదిరి ఇక్కడ డేర్ చేసి అస్సలు చెప్పరులే. అయితే శృతి మాత్రం, తాను ఖచ్చితంగా అలాంటి విషయాలను పెద్దగా గోప్యంగా ఉంచనని అంటోంది. మహా అయితే పేర్లు చెప్పనేమో గాని ఎఫైర్ల గురించి బయటెట్టేస్తాను అంటోంది.

తాజాగా ఫెమినీ మ్యాగజైన్ కొత్త ఎడిషన్ కు ఇంటర్యూ ఇచ్చిన శృతి హాసన్.. ఆ కవర్ పేజీల మీద హాటుగా మెరుస్తూ హీటు పుట్టించడమే కాదు.. మరో ప్రక్కన ఇంటర్యూలో తన సమాధానాలతో కూడా ఓట్లు కూడా కొట్టేస్తోంది. ఇక నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పూ అంటే. ''అతను చాలా మంచోడు. ఒక సంగీత కళాకారుడు. మంచి పద్దతులు తెలిసినవాడు. ఇప్పటికే నాకు గుర్తున్నాడంటే చూడండి. చాలామంది అమ్మాయిలకు తొలి బాయ్ ఫ్రెండ్ అంటే చాలా భయంగా ఉంటుంది. నాకు అలాంటిదేం లేదు'' అని చెప్పేసింది. మరి ఇంతకీ అతగాడితో ఎందుకు బ్రేకప్ అయినట్లోనని కామెంట్లు పడుతున్నాయి.

ఇకపోతే అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నుండి తిరుగు ప్రయాణం మొదలెట్టేసిందట శృతి, ఇక మరి ఇండియా రాగానే పవన్ సినిమా షూటింగ్ లో వాలిపోతుందా?

ఇది కూడా చూడండి: హీరోయిన్లు, వారి సైడ్ బిజినెస్ లు

ఇది కూడా చూడండి: అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

ఇది కూడా చూడండి: పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

English summary

Heroine Shruti Haasan talks about her First Boyfriend.