వాటికైనా రెడీ అంటోన్న ఆంటీ..

Heroine Sneha Says That She Was Ready For Any Type Of Roles

10:40 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Heroine Sneha Says That She Was Ready For Any Type Of Roles

హీరోయిన్లకు పెళ్లయ్యాక ఫీల్డ్ కి దూరంగా జరిగిపోతుంటారు. పైగా లిమిట్స్ కూడా ఉండనే ఉంటాయి. ఇక బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ పెళ్ళయినా ఇంకా హీరోయిన్లగానే చేస్తున్నారు. కానీ సౌత్ లో పెళ్ళయిన వాళ్ళని హీరోయిన్లుగా తీసుకోరు. మరి పలు సినిమాలతో అలరించిన హీరోయిన్ స్నేహ 2012 లో తమిళ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరికీ 2015లో బాబు పుట్టాడు. కామన్ గా హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే సినిమాలకు కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇస్తారు. అయితే స్నేహ మాత్రం అలా చేయలేదు. సినిమాలు చేస్తూనే వుంది. గత సంవత్సరం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' లో ఉపేంద్ర కు జోడీగా చేసి అదరగొట్టింది.

స్నేహ చెప్పేమాట ఏంటంటే, 'పెళ్ళై..బాబు వున్న తనకి హీరోయిన్ పాత్రలు రావు. అందుకే క్యారెక్టర్ రోల్స్ చేస్తా' అంటోంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాలలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు టచ్ లో వుంటూ మంచి ఆఫర్ల కోసం స్నేహ ఎదురు చేస్తోంది. అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి:ఈ హీరో విక్రమ్ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే(వీడియో)

ఇవి కూడా చదవండి:బాహుబలి ముందు చతికిలబడ్డ కబాలి

English summary

South Veteran Heroine Sneha was acted in some movies in South and did good roles and she married tamil hero and she was acting as a character artist in the movies and now she announced that she was ready for any type of roles.