అమ్మో, శిరోజాల ఖర్చు రూ 55లక్షలా ....

Heroine Spends 55 Lakhs For Hair Color

09:48 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Heroine Spends 55 Lakhs For Hair Color

అవునా , అవునని అంటున్నారు. నటి కత్రినా కైఫ్‌ 'ఫితూర్‌' చిత్రం కోసం శిరోజాలకు ఎరుపు రంగు వేసుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ ఎరుపు రంగు శిరోజాలతోనే కనిపించింది. ఈ రంగు వేయడానికి అక్షరాలా రూ. 55లక్షలు ఖర్చు చేసారట. ఖర్చు ఎంతన్న విషయం పక్కన పెట్టేస్తే, ఈ ఎరుపు రంగు జుట్టులో కత్రినా ఆకట్టుకునేలా ఉందని బాలీవుడ్ లో అంతా హాట్ టాపిక్ అయిందట. ఆదిత్యరాయ్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘ఫితూర్‌’ చిత్రానికి అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వం వహించారు.

అసలు శిరోజాల కోసం ఇంత ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్న ఉదయించక మానదు. ఇక్కడే అసలు కిటుకు వుంది. ఈ ఖర్చంతా శిరోజాల రంగుకి, బ్యుటీషియన్‌కి అయింది కానే కాదట. అసలు కంటే కొసరు ఎక్కువనే సామెత ఉండనే వుంది కదా. ఈ రంగు కోసం కత్రినా భారతీయ కేశాలంకరణ నిపుణులను కాకుండా, లండన్‌కు చెందిన హెయిర్‌ స్టైలిస్ట్‌ను సంప్రదించి, ఇందుకోసం కత్రినా ఏకంగా లండన్‌ వెళ్లి వచ్చిందట. మరి ఫస్ట్‌క్లాస్‌ ఫ్లైట్‌ టికెట్స్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస అన్నీ కలిపి నిర్మాత పెట్టిన ఖర్చంతా కలిపితే, 55 లక్షలు అయిందట. ఇంతకీ ఈసినిమా ఫిబ్రవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు.

English summary