సంచలనం రేపుతున్న హీరోయిన్‌ స్వాతిరెడ్డి వీడియో: స్టేషన్ లోనే తల్లిని కొట్టింది

Heroine Swathi Reddy slaps her mother in police station

06:32 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Heroine Swathi Reddy slaps her mother in police station

'లవ్‌' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న స్వాతిరెడ్డి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వస్తే స్వాతిరెడ్డి శ్రీనివాస్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. అయితే శ్రీనివాస్‌కి ఇంతకు ముందే పెళ్ళి అయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఇన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ శ్రీనివాస్‌ పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె స్వాతిరెడ్డి ని శ్రీనివాస్‌ బలవంతంగా తీసుకెళ్లి, మాయ మాటలు చెప్పి, మబ్బిపెట్టి స్వాతి దగ్గర ఉన్న డబ్బుని, బంగారాన్ని తీసుకున్నాడని నాగేంద్రమ్మ బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాస్‌ పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే స్వాతిరెడ్డిని పిలిపించారు.

అక్కడకి వచ్చిన స్వాతిరెడ్డి తన తల్లి పై భీభత్సం సృష్టించింది. నాకు ఇష్టమయ్యే శ్రీనివాస్‌తో ఉంటున్నానని పోలీసులకి చెప్పింది. అంతే కాదు నేను కష్టపడి విజయవాడ, హైదరాబాద్‌లో తిరిగి సినిమాల్లో అవకాశం దక్కించుకుంటే నా తల్లి నాగేంద్రమ్మ, నా సోదరుడు నేను తెచ్చే డబ్బుని మాత్రమే వాడుకుని నున్న పట్టించుకోవడం లేదని బాధపడింది. తన తల్లిని అందరి ముందే చెయ్యి కూడా చేసుకుంది. అంతేకాదు నేను సిగరెట్లు, మందు కూడా పుచ్చుకుంటానని పోలీసులు ముందు ఏ మాత్రం భయం లేకుండా చెప్పింది. అంతే కాదు నా తల్లి, సోదరుడే నాకు మందు కలిపిచ్చి, సిగరెట్‌ వెలిగిస్తారని చెప్పింది.

నా సోదరుడికి నా సొంత డబ్బుతో నేనే పెళ్ళి చేశానని స్వాతిరెడ్డి చెప్పింది. స్వాతిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకుని పోలీసులు అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన స్వాతిరెడ్డి-నాగేంద్రమ్మ వీడియో ఒకసారి చూడండి.

English summary

Love movie Heroine Swathi Reddy slaps her mother in police station at Banjara Hills.