రానా దగ్గరుంటే కంట్రోల్‌ చేసుకోలేదట..

Heroine Tapsee clarity on affair with rana

06:52 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Heroine Tapsee clarity on affair with rana

రానా గురించి ఈ మధ్య చాలా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది భామలతో ఎఫైర్లు ఉన్నట్లు చాలా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ఆజాను భావుడు గతంలో త్రిషతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. దాంతో వాళిద్దరూ ఆ వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఆ తరువాత ఇటీవల శ్రియతో ఎఫైర్‌లో ఉన్నాడంటూ పుకార్లు వచ్చాయి. మొదట్లో ఎవరూ స్పందించలేదు. దాంతో పుకార్లు కాస్తా షికార్లు చేసాయి. దాంతో శ్రియ స్పందించి మేమిద్దరం మంచి ప్రెండ్స్‌ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఆరడుగుల అందగాడు తాప్సీతో ఎఫైర్‌లో ఉన్నాడని ప్రచారం జోరుగా సాగుతుంది.

ఇది వరకే వీరిద్దరూ నటించిన చిత్రం బేబి. మరోసారి ఘూజీలో నటిస్తున్నారు. ఈ షూటింగ్‌ లో వీళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారట. ఖాళీ టైంలో కబుర్లు చెప్పుకోవడంతో పాటు సన్నిహితంగా వుంటున్నారని వార్తలొచ్చాయి. ఇంకేముంది వీళ్ళిద్దరి మధ్య 'సంథింగ్‌ సంథింగ్‌' అనే రూమర్‌ నడుస్తుంది. రానా, తాప్సీ కచ్చితంగా ప్రేమలో పడ్డారని సినీ వర్గాల వారు చర్చించుకోవడం మొదలు పెట్టేశారట. ఈ విషయం కాస్తా తాప్సీకి తెలిసి షాక్‌ అయ్యిందట ఈ ముద్దుగుమ్మ. తమ మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదని తెలిపింది. అంతేకాదండోయ్‌ వాళ్ళిద్దరికీ సేమ్‌ టేస్ట్‌లు ఉన్నాయంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ మేమిద్ధరం ఒకరి కంపెనీని మరొకరు ఇష్టపడతాం. మా ఇద్దరికీ నచ్చిన ఫుడ్‌ ఐటమ్స్‌ దాదాపు ఒకటే అని చెప్పారు. ఇంకా ఇవాళ ఏం తినాలా ? అని వారు కూర్చొని డిజైన్‌ చేస్తుంటారట. ఫుడ్‌ ఆర్డర్‌ చేయించుకొని ఇద్దరం కూర్చొని తింటారట. రానా లాంటి ఫుడ్‌ లవర్‌ దగ్గరుంటే.....నోటిని కంట్రోల్‌ చేసుకోవడం కష్టం అని తాప్సీ చెప్పుకొచ్చింది.

1/6 Pages

త్రిష తో

రానా కి త్రిష తో ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. దాంతో త్రిష, రానా స్పందించి ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పడేసారు.

English summary

Rana was born on 14 December 1984, in Chennai, Tamil Nadu, to Telugu film producer Daggubati Suresh Babu. In the past he was linked with Trisha, Shriya and then with Tapsee.