తాప్సిని వెంటాడి వేధించిన సైకో ...

Heroine Tapsee Harassed By Psycho Fan

10:33 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Heroine Tapsee Harassed By Psycho Fan

మానసిక రుగ్మతలతో బాధపడే సైకో లతో వేగడం చాలా కష్టం. వీళ్ళు ఓ పట్టాన వదలరు. అది ఎవరైనా సరే. ఒక్కోసారి హత్యల దాకా వెళ్లారు కూడా. ఇక అందాల నటి తాప్సీ పొన్ను ను ఓ సైకో వెంటపడి వేధించాడట.. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ.. ఆమె షూటింగ్ స్పాట్ లవద్దకు చేరుకొని ఆమెను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చాడని తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా తాప్సీ కి మరింత సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించాడట.

ఇతని అభిమానం మరీ వెర్రి తలలు వేస్తుండడాన్ని భరించలేకపోయానని, అయితే ఎలాంటి హానీ తలపెట్టలేదని, అందుకే తను పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేయలేదని తాప్సీ తెలిపింది. ఇంతకీ అతగాడు ఈమె ఫాన్ అట. ఇక తన షూటింగ్ వివరాలు ఆ వీరాభిమానికి ఎలా తెలుస్తున్నాయో అని ఈ అమ్మడు ఆశ్చర్యపోయింది. ఏమైనా ఇలాంటి వీరాభిమానులపట్ల సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని తాప్సీ కోరుతోంది. ఎంతైనా స్వానుభవం కదా. అందుకే హెచ్చరికలు చేస్తోంది.

ఇది కూడా చూడండి: తిరిగే భూమి ఒక్కసారిగా ఆగిపోతే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: రైలు పట్టాలకింద కంకర రాళ్ళ వెనుక కథేమిటి?

ఇది కూడా చూడండి: గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

English summary

Beautiful Heroine Tapsee Harassed By Psycho Fan..