హీరోయిన్ అంటే కేవలం అందుకేనా ?

Heroines only for exposing

12:00 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Heroines only for exposing

సావిత్రి, భానుమతి, జమున, ఇలా అలనాటి హీరోయిన్స్ పేర్లు వినగానే మనమే కాదు మరో నాలుగు తరువాత తరాల వారైన చేతులెత్తి దండం పెడుతారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. ఎక్కడ చూసినా ఈ చర్చ కనిపించడం సహజం. అప్పట్లో హీరోయిన్ అంటే హీరో పక్కన నటించడానికి, హీరోతో కలసి కధని ముందుకి తీసుకొని పోవడానికి ఉపయోగపడే లీడ్ రోల్. తరువాత కాలంలో హీరోయిన్ అనే మాటకి అర్ధం మారిపోయింది. హీరోయిన్ అంటే నటనతో పాటు అందాల విందు కూడా చేయాలి అన్న రూల్స్ పరిశ్రమలో వచ్చేశాయి. ఇంకొంత కాలం పోయాక అంటే ఇప్పుడు హీరోయిన్ అంటే కేవలం తన అందాలు చూపిస్తే సరిపోద్ది అన్న ఆలోచన దర్శ , నిర్మాతల్లో వచ్చేసింది.

ఇందుకు తగ్గట్టు ఇప్పటి హీరోయిన్స్ కూడా ఎవరు తక్కువ డ్రెస్ వేసుకున్నారో అని పోటీ పెట్టుకొని మరీ ఎక్స్ పోజింగ్ చేస్తుండటంతో దర్శకులు కూడా ఈ ఎక్స్ పోజింగ్ మీదే ఎక్కువ శ్రద్ద పెడుతూ వస్తున్నారు. అయితే అందాలు ఆరబోసి స్టార్ గా వెలిగిపోయి, నాలుగు రూపాయులు సంపాదించుకోవచ్చు కాని , సావిత్రి గారిలా , జమున గారిలా తర తరాలకి తరిగిపోని కీర్తిని అయితే సంపాదించుకోలేరు అన్నది స్పష్టం. అయినా రియల్ లైఫ్ లోనే నిండుగా బట్టలు వేసుకోవడానికి ఇష్టపడని మన హీరోయిన్స్ కెమెరా ముందు.. నిండు తనంతో కనిపించే రోజులు పోయాయని చెప్పవచ్చు. అందుకే ఓ సినిమా అయ్యాక ఆ హీరో పక్కన మరో కొత్త హీరోయిన్ కనిపించక పొతే ఆ సినిమా ఎందుకూ కొరగాకుండా పోతోంది. గతంలో ఎన్ టి ఆర్ - శ్రీదేవి , కృష్ణ - జయప్రద , చిరంజీవి - రాధిక, బాలకృష్ణ - విజయశాంతి ఇలా హిట్ ఫెయిర్ కాంబినేషన్ లు ఉండేవి. ఇప్పుడు ఒక సినిమాతోనే మొహం మొత్తే పరస్థితి తెచ్చేసారు.

ఇది కూడా చూడండి:తోడేలు రూపంలో ఉన్న ముగ్గురు న్యూడ్ లేడీస్(వీడియో)

ఇది కూడా చూడండి:రాశీఖన్నా నా భార్యైతే అదృష్టమే అన్న సాయి ధరమ్ తేజ్

ఇది కూడా చూడండి:బాలీవుడ్ హీరోయిన్లు ఓ రాత్రికి రేటు తెలిస్తే షాకే!

English summary

Heroines only for exposing