రహస్యలోయ 'గండికోట' వెనుక దాగిన రహస్యాలివే!

Hidden Gandikota in India

10:50 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Hidden Gandikota in India

పూర్వం రాజులు కోటలు కట్టి వాటికి బురుజులు పెట్టి దుర్భేజ్యమైన కోటగా మార్చేవారు. శతృవులను రాకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉండేవి. ఇక మనం చెప్పుకునే కోట కూడా ఇంచుమించు అలాంటిదే అయినా రహస్యలోయలో వుంది ఇది. చుట్టూ ఎత్తైన గోడలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడ్డ దుర్భేద్యమైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయలు, కోటలు, అందులో అంతః పురాలు, దేవాలయాలు, మసీదులు, పూల తోటలు.. ఇవన్నీ గండికోట వర్ణనలో భాగమే. గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం.

ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండి కొండలు అని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు చెబుతారు. కడప నుండి 52 మైళ్ళ దూరంలో, జమ్మలమడుగు నుండి 15 కిలోమీటర్ల దూరంలో, తాడిపత్రి నుండి 80 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగుంట్ల నుండి 46 కిలోమీటర్ల దూరంలో, మైదుకూరు నుండి 57 కిలోమీటర్ల దూరంలో, ప్రొద్దుటూరు నుండి 36 కిలోమీటర్ల దూరంలో గండికోట వుందని తెలుస్తోంది.

1/11 Pages

1. గండికోట లోయ...


గండికోట ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ సుందర దృశ్యం వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఎర్రటి గ్రానైట్ శిలలు, లోయలో నదీ ప్రవాహం, పక్షుల సవ్వడులు ఈ లోయకు అదనపు ఆకర్షణలుగా వున్నాయి.

English summary

Hidden Gandikota in India