కొత్త 500 నోటుపై దాగిన నిజమిదే!

Hidden secrets of new 500 Rupees

12:21 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Hidden secrets of new 500 Rupees

ఈ మధ్య కొత్తగా వస్తున్న 500 నోట్ల పై కుడి, ఎడమ వైపుల నల్ల చారలు కనిపిస్తున్నాయి. అలాగే సీరియల్ నెంబర్ కూడా ముందు చిన్నగా ఉండి చివరికి పెద్ద అక్షరాలలో ఉంటున్నాయి. వీటిని ఎప్పుడైనా గమనించారా? అసలు ఇవి ఒరిజినలా లేక నకిలీ నోట్లా అనే సందేహం వచ్చే ఉండచ్చు. వీటి వెనుకు ఉన్న అసలు నిజాన్నితెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాస్తవానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతగా నిఘా పెట్టినా సరే, రోజురోజుకి నకిలీ నోట్ల దందా ఉహించని విధంగా పెరిగిపోతోంది. దీని వెనుక మాఫియా హస్తం ఉందన్న విషయం అందరికీ తెలిసినా, ఏమి చేయలేని స్థితి నెలకొంది. ఇక ఎంతో మంది ఈ నకిలీ దందాలో ఇరుక్కొని జైలు పాలు అవుతున్నారు. నకిలీ నోట్లకి, అసలీ నోట్లకి తేడా ఉండాలని రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేస్తూ వస్తోంది. అయితే వీటి గురించి చాలా మందికి తెలిసుండదు. తెలుసుకోవాలని కూడా పెద్దగా ఆసక్తి కూడా ఉండదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న 500 నోట్ల పై కుడి, ఎడమ వైపుల నల్ల చారలు ఉంటున్నాయి. ఈ నోట్లు ఒరిజినల్ నోట్లేనని ఏ బ్యాంకు వారిని అడిగినా చెబుతారు. కళ్ళు సరిగ్గా కనపడని వారు లేదా గుడ్డి వారు ఈ చారాలను తాకితే అది ఏ నోటో గుర్తుపట్టగలరు. అది నకిలీ నోటా లేక సరైన నోటా అనే విషయాని కూడా గమనించగలరు. ఇలాంటి వారికి వీలుగా ఉండాలని ఆర్.బీ.ఐ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అదండీ సంగతి.

ఇది కూడా చూడండి: సినీ హీరోగా బుల్లితెర యాంకర్ ప్రదీప్!

ఇది కూడా చూడండి: బ్రూస్ లీ మరణం వెనుక రహస్యం

ఇది కూడా చూడండి: పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్

English summary

Hidden secrets of new 500 Rupees.