భాగ్యలక్ష్మి టెంపుల్ పై ఐసిస్ కళ్ళు

High Alert In Hyderabad Due To Terror Threat

11:00 AM ON 1st July, 2016 By Mirchi Vilas

High Alert In Hyderabad Due To Terror Threat

ప్రపంచంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న టెర్రరిస్టుల కళ్ళు ఇప్పుడు భాగ్యనగరం అదేనండీ హైద్రాబాద్ మీద పడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీలో బుధవారం అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరుల నుంచి భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భాగ్యలక్ష్మి ఆలయాన్ని పేల్చేయాలని ఐసిస్ లక్ష్యంగా ఎంచుకున్నారట. ఈమేరకు వీళ్లనుంచి ఎన్ ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. దీంతో పాటు శక్తివంతమైన బాంబులతో పోలీస్ స్టేషన్ పైనా దాడికి కుట్ర పన్నారని ఎన్ ఐఏ అధికారులు వెల్లడించారు.

నిన్న అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని ఎన్ ఐఏ అధికారులు విడిచిపెట్టారు. మిగిలిన ఐదుగురిని కస్టడీలోకి తీసుకుని మరింత కీలక సమాచారం రాబట్టాలని ఎన్ఐఎ భావిస్తోంది. కాగా, వీరి నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, రసాయనాలు, నగదు ఎక్కడి నుంచి సరఫరా అయిందో తెలుసుకునే పనిలో ఉంది.

ఇవి కూడా చదవండి:బిజెపి నేత ఇంట 'బాల్య వివాహం’..షాకింగ్ న్యూస్

ఇవి కూడా చదవండి:నేను ప్రెగ్నెంట్ అంటూ అతన్ని బ్లాక్ మెయిల్ చేసిన రెజీనా

English summary

ISIS Terrorists were planned to bomb attacks in Hyderabad and they were searched some places to bomb attack and they were arrested by the police and they said that they were targeted Bhagya Lakshmi Temple and some other places in Hyderabad.