రోజా సస్పెన్షన్ కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

High Court Lifts Suspension On Roja

01:18 PM ON 17th March, 2016 By Mirchi Vilas

High Court Lifts Suspension On Roja

సస్పెన్షన్ కొట్టేస్తూ,తదుపరి విచారణ వాయిదా వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై వైసిపి ఎంఎల్ఎ, నటి రోజా ఆనందం వ్యక్తం చేసింది. ఇక రోజాకు హైకోర్టులో ఊరట లభించిందని తెలుసుకున్న నగరి నియోజకవర్గ  వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

చెల్లెలి నగ్న వీడియో ఉందని చెప్పి అక్కను వాడుకున్నాడు

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

 

రోజా సస్పెన్షన్ ఎత్తివేయడం పూర్తి వివరాలు స్లైడ్ షోలో

1/6 Pages

సస్పెన్షన్ పై మధ్యంతర ఉత్తర్వులు...

      రోజా సస్పెన్షన్‌ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన  తీర్మానాన్ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుదపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సిఎమ్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెల్సిందే. . శాసనసభ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రోజా తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రోజా వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఫలితంగా ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి. భోసలే.. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు జస్టిస్‌ రామలింగేశ్వరరావుకు అనుమతిస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ సాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు గురువారం జారీ చేస్తామని ప్రకటించారు. ఈ కేసులో రోజాపై విధించిన సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేస్తూ జస్టిస్‌ రామలింగేశ్వరరావు ఆదేశాలిచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు రోజా హాజరయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

English summary

High court of Andhra Pradesh Lifts Ban Against Ban on Nagari Ysrcp MLA Roja from Andhra Pradesh Assembly.Roja and Ysrcp party leaders felt happy on this and Ysrcp MLA's were waiting to welcome Roja to Assembly in a grand way.