అగ్రి గోల్డ్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ 

HIgh Court Serious On AgriGold Case

12:46 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

HIgh Court Serious On AgriGold Case

అగ్రిగోల్ద్ వ్యవహారంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సిఐడి దర్యాప్తు నివేదిక సమర్పించగా , నివేదిక పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అగ్రిగోల్ద్ ఆస్తుల వేలం వ్యవహారాన్ని 2,3 రోజుల్లో ఖరారు చేస్తామని కమిటీ చెప్పింది. 3 సంస్థలకు వేలం అప్పగిస్తామని కమిటీ పేర్కొంది.

నిన్నటి రోజున అగ్రిగోల్ద్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ, దర్యాప్తు తీరుపై , ఆస్తుల వేలం పై జాప్యం చేస్తే ఎలాగని ప్రశ్నించింది. ఇలాగైతే తాము ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సి ఐడి దర్యాప్తు నివేదిక మంగళవారం సమర్పించింది. నివేదిక పై కూడా హైకోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

English summary

High court serious on Agri Gold Case investigation. Yersterday CID present a report on agrigold case to court. High Court was postponed to next Monday