ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్

High Court Serious On Sand Mafia

02:39 PM ON 28th December, 2015 By Mirchi Vilas

High Court Serious On Sand Mafia

తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నాళ్ళూ హైపవర్ కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. అసలు ఏమి చేస్తున్నారని కడిగేసింది. ఇసుక మాఫీయా నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ , తక్షణం హై పవర్ కమిటీ వేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే , గడిచిన ఎన్నికల తర్వాత ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయి. వేలకువేలు పెట్టి ఇసుకు కొనలేక నిర్మాణ రంగం కుదేలయింది. ఇక సామన్యులైతే ఇసుక కొనాలంటే గగనమైంది. మహిళా సంఘాలకు ఇచ్చినా, ఎన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. రాజకీయ పక్షాలు , నిర్మాణ రంగ కార్మికులు ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం పెద్దగా లేదు. దీంతో హైకోర్టు లో పిటీషన్ దాఖలవడంతో న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది.

తక్షణం హైపవర్ కమిటీ వేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మరి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

English summary