తీహార్‌జైలులో భారీభద్రత మధ్య చోటారాజన్‌

High Security To Chota Rajan In Tihar Jail

11:21 AM ON 21st November, 2015 By Mirchi Vilas

High Security To Chota Rajan In Tihar  Jail

ఇటీవల భారత ప్రభుత్వానికి చిక్కిన అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటారాజన్‌ను 14రోజుల రిమాండ్‌ నిమిత్తం తీహార్‌ జైలుకు తరలించారు. ఇండియాలోనే అత్యంత కట్టుదిట్టమైన జైలుగా పేరొందిన తీహార్‌ జైలులో చోటారాజన్‌ ను తరలించిన నేపథ్యంలో మరింత భద్రతను పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. జైలు సూపరింటెండెంట్‌ ఇప్పటికే జైలు సిబ్బందికి గట్టి వార్నింగ్‌ ఇచ్చారట. ఎటువంటి తప్పిదం జరగడానికి ఏమాత్రం ఆస్కారం ఉండని రీతిలో సెక్యూరిటీ ఉండాలని ఆ వార్నింగ్‌ సారాంశమట.

గురువారం నాడు తీహార్‌ జైలులో అడుగుపెట్టిన చోటారాజన్‌ పై ప్రతీనిముషం వేయికళ్ళు నిఘా వేసేలా సెక్యూరిటీని సిద్ధం చేసారు. మహారాష్ట్ర పోలీసులు చోటారాజన్‌పై 78కిపైగా కేసులలో నిందితునిగా కోర్టు ముందుకు హాజరుపరచగా కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించిన విషయం ఇప్పటికే తెలిసిందే.

అక్టోబర్‌ 25న బాలిలో ఎంతో నాటకీయ పరిస్థితుల మధ్య చిక్కిన చోటా రాజన్‌ గత 25ఏళ్ళుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మర్డర్‌లు, మానభంగాలు, బెదిరింపులు లాంటి కేసులకు అంతేలేకుండా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన చోటా దావూద్‌ ఇబ్రహాంకు శిష్యుడిగా ఉండేవాడు. కానీ కొన్ని విభేదాల వలన దావూద్‌కు దూరమై తన నేర సామ్రాజ్యాని విస్తరించాడు.


English summary

Security has been stepped up in and around Jail no 2 of Tihar prison where underworld don Chhota Rajan was lodged on Thursday after being remanded in a 14-day judicial custody.