రికార్డు స్థాయి వర్షంతో వణుకుతున్న చెన్నై 

Highest Rainfall Recorded In Chennai

01:19 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Highest Rainfall Recorded In Chennai

శీతాకాల వేళ వర్షం .... అదికూడా రికార్డు స్థాయిలో .... వరుసగా అల్పపీడన ద్రోణి లు కారణంగా నవంబర్ నుంచి డిసెంబర్ ప్రవేశించినా వర్షం వదలలేదు. దీంతో తమిళనాడు కకావికలమైంది ముఖ్యంగా చెన్నై నగరం వర్షంతో వణికిపోతోంది. గడిచిన వందేళ్ళ కాలంలో ఎప్పుడూ నమోదు కాని వర్షం ఇప్పటివరకు కురిసింది. ఇంకా తడిసి ముద్దవతునీ వుంది. జన జీవనం స్తంభించింది. విచిత్ర మేమంటే చెన్నై మహానగరంలో పలు సార్లు నవంబర్ లోనే వర్ష భీభత్సం ముంచెత్తుతోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే , చెన్నై 1918 నవంబరులో 108.8 సెంటీమీటర్ల వర్షం కురిస్తే అప్పట్లో చెన్నై నగరి మునిగి పోయింది..1985లో 97 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైంది. తాజాగా ఆ రికార్డు బద్ధలై.. మళ్ళీ నవంబర్ లోనే 119.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది కాక గడిచిన 24 గంటల్లో 37.4 సెంటిమీటర్ల వర్షం కురిసింది. సాధారణంగా మనదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం చిరపుంజి. అయితే దాన్ని తలదన్నే రీతిలో చెన్నైలో వర్షపాతం నమోదై , ప్రజా జీవనాన్ని దెబ్బతీసింది. ఇన్ఫోసిస్ వంటి సంస్థల కార్యలయాల్లోకి నీళ్ళు చేరాయి.

వర్షాల కారణంగా 188 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంతాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసి, ప్రజా రక్షణ కోసం నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఆదేశించింది. చెన్నైలో వర్షం.. తలపిస్తోంది. భారీ వర్షాలతో పాటు.. పెద్ద ఎత్తున వీస్తున్న గాలులు వీస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. చెన్నైలోని విమానాశ్రయాన్నితాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రన్ వే జలశయాన్ని తలపించేలా ఉంటే.. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో దాదాపుగా 400 పైగా చిక్కుకుపోయారు. హైదరాబద్ శంషా బాద్ విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్ళే విమానాలను రద్దు చేసారు.

వర్షాలతో వణుకుతున్న తమిళనాడును ఆదుకుంటామని ప్రధాని నరెంధ్రమోది హామీ ఇచ్చారు. సిఎమ్ జయలలితతో ప్రధాని ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

English summary

Highest rainfall recorded in chennai history. There were continous rains from two days in tamuilnadu. Due that rains there were lots of loss in chennai.Airpor have been closed due to rain in chennai. Few trains are also cancellled in chennai and schools,colleges and many other institutions were remained closed