రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తున్న హిజ్రా

Hijra Competing In Tamil Nadu Elections

10:43 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Hijra Competing In Tamil Nadu Elections

రాజకీయాలన్నాక ఎన్నో సవాళ్లు , వింతలూ , విడ్డూరాలూ వుంటాయి.అందునా ఎన్నికల్లో మరీను ... సరిగ్గా తమిళనాట ఓ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్ధులకు ఓ హిజ్రా ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓసారి వివరాల్లోకి వెళ్తే , రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన మదురై సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు ఓ హిజ్రా గట్టి సవాల్ విసురుతోంది. శాసనసభ మాజీ స్పీకర్ పీటీఆర్ పళనివేల్ రాజన్ తనయుడు త్యాగరాజన్ డీఎంకే నుంచి పోటీ చేస్తుంటే, ఇక్కడ భారతీ కన్నమ్మ అనే హిజ్రా ‘ఇలైంజర్ కూట్టమైప్పు ’ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఆమెను తమ అభ్యర్థిగా నిలబెట్టేందుకు పీఎంకే, నామ్ తమిళర్ కట్చి, సమత్వ మక్కల్ కట్చిలు ప్రయత్నించినా కుదరలేదు. స్వతంత్రంగా బరిలో దిగిన ఆమె ఇక్కడ యువ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించనున్నారని అంటోంది.. దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ అభ్యర్థిగా మదురై లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది.

ఇవి కూడా చదవండి: ఓ తప్పు మొత్తం సంస్థనే డిలీట్ చేసేసింది!

సోషియాలజీలో పీజీ పూర్తి చేసి మార్కెటింగ్ విభాగంలో అనేక కంపెనీలలో విధులు కూడా నిర్వహించిన ఆమె ఇప్పుడు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తోంది.. 2010లో భారతీ కన్నమ్మ ట్రస్టును సైతం ఏర్పాటు చేసిన ఆమె, మద్యానికి బానిసలైన భర్తల ఆగడాల నుంచి మహిళలకు ట్రస్ట్ ద్వారా రక్షణ కల్పిస్తోంది. ఇలైంజర్ కూట్టమైప్పు విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆమె చెబుతోంది. గుజరాత్ లో సాధ్యమైన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఇక్కడా అమలు చేయొచ్చని అంటున్న ఆమె తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ మండలిలో సలహాదారుగా, జిల్లా న్యాయ సేవా సంస్థలో సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఎన్నికల్లో నిలవడంతో రాజకీయ పక్షాలకు దడ పుడుతోంది. మరి ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అత్తతోనే సరసాలు.. మామకు తెలిశాక ఏం చేసాడో చూడండి?

భర్త రెచ్చిపొమ్మన్నాడు... ఇక అందాలు ఆరబోస్తా...

దావూద్ అంత పెద్ద తోపు ఏమి కాదు

English summary

A Hizra Named Ilainzer Kuttamaippu in Tamilnadu was Competeting as An Independent Candidate in Tamilnadu Elections. Presently she was working as a Sales Manager in HDFC Bank.