ఢిల్లీ ఎంఎల్‌ఎ ల జీతాలు పెంపు 

Hike In Delhi MLA's Salary

11:23 AM ON 5th December, 2015 By Mirchi Vilas

Hike In Delhi MLA's Salary

ఢిల్లీ ఎంఎల్‌ఎ ల జీతాలను 400% శాతం పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ లో చేసిన సిఫార్సును ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటి వరకు ఒక్కో ఎంఎల్‌ఎ కు 12 వేలు ఉండగా, ఈ పెంపు వల్ల 50 వేలకు పెరగనుంది. నియోజకవర్గ జీతభాత్యాలు కూడా 18 వేలనుండి 50 వేలకు పెంచారు. ఆఫీసు అసిస్టెంట్ల నెలవారి జీతభత్యాలను కుడా 70 వేలకు పెంచారు. ఇలా అనేక పెంపులతో మొత్తం 88,000 ఉన్న నెలవారి జీతం 2,35,000 లకు పెంచుతూ ఢిల్లీ శాసనసభ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీతాల పెంపుదల బిల్లును ఢిల్లీ అసెంబ్లీ వారు కేంద్రం ఆమోదం కోసం పంపిస్తారు. కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ఈ జీతాల పెంపు అమలుల్లోకి వస్తుంది. అంతేకాక ఎంఎల్‌ఎల వేతనం సంవత్సరానికి ఒక సారి 10 శాతం పెంచాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.

ఈ జీతాల పెంపును 67 ఆప్‌ ఎంఎల్‌ఎ లు సమార్ధించగా , బిజేపి ఎంఎల్‌ఎలు మాత్రం ఇది క్రేజీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయమని వారు ఖండించారు.

English summary

Delhi government increased the salaries of the delhi mla's by 400 percent. Delhi assembly also accepted this bill and send this bill to central government acceptance