శ్రీవారి  టిక్కెట్లు, లడ్డూ  ధరల పెంపు వాయిదా

Hike Of Tirumala Laddu Price Postponed

05:56 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Hike Of Tirumala Laddu Price Postponed

భక్తులపై భారీగా భారం మోపడంతో పాటు లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించే విధానానికి మంగళం పలుకుతూ ఉప సంఘం చేసిన సిఫార్స్‌లను వాయిదా వేస్తూ ధర్మకర్తల కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు, లడ్డూ ప్రసాద ధరల పెంపు చేయాలనీ కమిటీ చేసిన సిఫారుల పై వ్యతిరేకత వ్యక్తం కావడంతో టిటిడి బోర్డు ప్రస్తుతానికి ఈ అంశాల జోలికి వెళ్లరాదని నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన టిటిడి బోర్డ్ సమావేశంలో టిటిడి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసారావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2678 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు టిటిడి బడ్జెట్‌లో ఈసారి ధర్మప్రచారానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.1010కోట్లు, డిపాజిట్లపై వడ్డీల ద్వారా రూ.779 కోట్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల నుంచి రూ.209 కోట్లు, ప్రసాదాల వితరణ నుంచి రూ.175 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు.

శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు, లడ్డూ ప్రసాద ధరల పెంపును వాయిదా వేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుమల, నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపాన్ని రూ.18 కోట్లతో నిర్మించేందుకు కమిటీ తీర్మానం చేసింది.

English summary

Tirumala Tirupati Devesthanam(TTD) has postpone the decision to increase price of Tirumala Laddu.Many people oppose this TTD decision and Saturday TTD Chairman Chadavada Krishna Murthy said this thing to Media