హైక్‌ యూజర్లు@వంద మిలియన్లు

Hike Reaches One Million Users

10:55 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Hike Reaches One Million Users

ప్రముఖ మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌ హైక్‌ వినియోగదారులు వంద మిలియన్లకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. హైక్ నుంచి నెలకు దాదాపు 40 బిలియన్ల మెసేజ్‌లు పంపుకుంటున్నట్లు తెలిపింది. 2015 అక్టోబరు నుంచి హైక్‌కు 30 మిలియన్ల వినియోగదారులు పెరిగారని.. గత అయిదు నెలల్లో వినియోగదారులు పంపించుకునే మెసెజ్‌లు రెట్టింపు అయ్యాయని హైక్‌ సీఈఓ కవిన్‌ భారతి మిట్టల్‌ వెల్లడించారు. వారంలో 120 నిమిషాలు వినియోగదారులు హైక్‌ యాప్‌కు సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 2015 అక్టోబరులో ‘హైక్‌ డైరెక్ట్‌’ను ప్రవేశపెట్టిన తర్వాత 10 మిలియన్ల ఫైల్స్‌ పంపించుకున్నారని హైక్‌ స్పష్టంచేసింది. దగ్గరలో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా హైక్‌ డైరెక్ట్‌ ద్వారా నేరుగా ఫైల్స్‌ పంపిచుకోవచ్చు. గత నెలలో హైక్‌ 8 భారతీయ భాషలను సపోర్ట్‌ చేస్తూ సేవలను విస్తరించింది.

English summary

Popular instant messaging app Hike reaches one million users. This was officially said by Hike CEO Kavin Bharati Mittal