అధ్యక్ష అభ్యర్థిత్వం పొందిన తొలి మహిళ గా రికార్డు

Hillary Clinton is first female presidential nominee

12:07 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Hillary Clinton is first female presidential nominee

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు కొత్త పుంతలు తొక్కాయి. ఆ దేశ చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. అమెరికా విదేశాంగ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (68) ఈ చరిత్ర సృష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ(డెమోక్రాటిక్) అభ్యర్థిత్వాన్ని సాధించిన తొలి మహిళగా ఈమె రికార్డు కెక్కారు. కాలిఫోర్నియా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, సౌత డకోటా రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో బుధవారం ఘనవిజయం సాధించారు. పార్టీ అభ్యర్థిత్వం పొందడానికి అవసరమైన 2,383 మంది ప్రతినిధుల మద్దతు పొందారు. ప్రస్తుతం ఆమెకు 2,497 డెలిగేట్లు మద్దతిస్తున్నారు. అయితే మొంతానా, నార్త్ డకోటా ప్రైమరీల్లో విజయం సాధించిన ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్(74) పోటీ నుంచి వైదొలగేందుకు నిరాకరించారు. ఆయనకు 1,663 మంది డెలిగేట్లు మద్దతిస్తున్నారు. అత్యధిక ప్రతినిధుల మద్దతు గెలిచిన హిల్లరీకి అధ్యక్షుడు ఒబామా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, హిల్లరీ గెలిస్తే ఒబామా దారుణ పాలనకు కొనసాగింపే అవుతుందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో ఘాటైన వ్యాఖ్య చేసాడు. ఇక యుద్ధం తారాస్థాయికి చేరినట్లే.

ఇది కూడా చూడండి:అంతరిక్షంలో అమీర్ అడుగు

ఇది కూడా చూడండి:ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

ఇది కూడా చూడండి:స్నేక్ వైన్ గురించి ఎప్పుడైనా విన్నారా(వీడియో)

English summary

Hillary Clinton is first female presidential nominee.