అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలిపోయింది

Hillary Clinton Leads in Harvard Institute Of Politics Poll

11:23 AM ON 27th April, 2016 By Mirchi Vilas

Hillary Clinton Leads in Harvard Institute Of Politics Poll

ప్రపంచంలో అగ్ర రాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా కు కాబోయే ప్రెసిడెంట్ అభ్యర్థి ఎవరనే దాని పై సర్వత్రా చర్చలు జరుగుతుండగానే అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షులెవరో తేలిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ పోటీ పడితే విజయం ఎవరిని వరిస్తుంది..? మీరు ఎవరికి ఓటేస్తారు..? అనే దానిపై హార్వార్డ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ ఓ పోల్ నిర్వహించింది. ఆ పోల్ ఫలితాన్ని సోమవారం ప్రకటించింది. ఆ సర్వే షాకింగ్ ఫలితాన్నే ఇచ్చింది.

ఇవి కూడా చదవండ: 7గురిని రక్షించి మరీ మరణించిన కుక్క

అమెరికన్ యూత్‌లో భారీ క్రేజ్ ట్రంప్‌కు ఉందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో గెలుపు ఆయనదే అని చాలామంది భావిస్తున్నారు. కానీ అనూహ్యంగా హిల్లరీ క్లింటన్.. అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికయి చరిత్ర సృష్టించబోతోందని పోల్ తేల్చిచెప్పింది. ఈ పోల్‌లో ఏకంగా 61శాతం మంది హిల్లరీనే ప్రెసిడెంట్ అవుతారని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్‌కు కేవలం 25శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. ఎవరు అధ్యక్షుడవుతారో తమకు తెలియదని 14శాతం మంది తెలిపారు. మొత్తానికి ఈ సర్వేతో ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి ...

ఇవి కూడా చదవండి: వేణుమాధవ్ కి ఏమైంది? సినిమాల్లో ఎందుకు నటించడం లేదు?

ఇవి కూడా చదవండి: పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

English summary

Recently a survey which was made by Harvard Institute Of Politics said that Hillary Clinton will be the next president of America. 61 % of the people said that Hillari will win and only 25 % of the people said Donald Trump will win and rest 14 % said that they don't know who will win.