హవ్వ ! న్యూయార్క్ లో హిల్లరీ నగ్న విగ్రహం!!

Hillary Clinton Naked Statue Appears In New York City

10:47 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Hillary Clinton Naked Statue Appears In New York City

అమెరికా అధ్యక్ష ఎన్నిక లు దగ్గర పడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం ఒకటి మాన్ హట్టన్ లో కలకలం రేపింది.వాల్ స్ట్రీట్ కు కూతవేటు దూరంలో ఉన్న మాన్ హట్టన్ సబ్ వే స్టేషన్ వద్ద అసభ్యకరంగా ఉన్న ఈ విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. బ్లోయింగ్ గ్రీన్ సబ్ వేపై మంగళవారం ఉదయం ఇది దర్శనమిచ్చింది. హిల్లరీ టాప్ లెస్ విగ్రహాన్ని చూసిన ఓ మహిళ ఆగ్రహంతో దానిని కిందపడేసింది. దీంతో ఆ విగ్రహాన్ని తయారుచేసినట్టు చెబుతున్న ఆంథోనీ సియోలి, మహిళ నాన్సీ మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో విగ్రహాన్ని తిరిగి నిలబెట్టేందుకు సియోలీ ప్రయత్నించగా మహిళ అడ్డుకుని విగ్రహంపై కూర్చుండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని, దానిని తీసుకెళ్లిపోవాలని సియోలికి సూచించారు. కాగా ఆగస్టులో హిల్లరీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాన్ని కూడా అమెరికా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులిద్దరి నడుమ విమర్శల జడివాన తారాస్థాయికి చేరగా ఇప్పుడు ఈఘటనతో ప్రచారం మరింత వేడెక్కనుంది.

ఇది కూడా చూడండి: డబ్బులు ఎక్కడ దాచితే.. ఎక్కువ ధనవంతులవుతారో తెలుసా?

ఇది కూడా చూడండి: వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఇది కూడా చూడండి: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు!

English summary

Hillary Clinton Naked Statue Appears In New York City. She is an American politician and the Democratic Party nominee for President of the United States in the 2016 election.