అమెరికా ఎన్నికల్లో గెలుపు ఎవరిదో... షాకిస్తున్న సర్వే ఫలితాలు!

Hillary Clinton takes lead on Donald Trump

03:39 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Hillary Clinton takes lead on Donald Trump

ఇప్పుడు అందరి దృష్టి అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలపైనే. కీలకమైన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగానే ఉందని అంటున్నారు. ఈనేపధ్యంలో ఓ సర్వే షాకిచ్చే విధంగా వుంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు మనోధైర్యాన్ని ఇచ్చేవి ఏమైనా ఉన్నాయంటే అవి కచ్చితంగా సర్వేలే కదా. మరి ఈ సర్వేలు ఫలితాలకు సంబంధించిన ఉత్కంఠను కొన్నిసార్లు పెంచుతూపోతే.. మరికొన్నిసార్లు అభ్యర్థులను హెచ్చరిస్తుంటాయి. అనేక సందర్భాల్లో సర్వేలతో మేల్కొని ముందుకుపోయినవారు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సర్వేలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా ఎన్నికల వేళ ఓ సర్వే ఇలా చెప్పుకొచ్చింది. ఈ ఎన్నికలపై ఉత్కంఠను రోజు రోజుకీ పెంచుతున్నాయి.

ఈ ఎన్నికల్లో తన నోటిమాటలతో - సంచలన వ్యాఖ్యలతో ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకూ పాయింట్ల పట్టికలో ముందున్న డొనాల్డ్ ట్రంప్ కు తాజా సర్వే ఫలితాలు షాకిచ్చాయట. తాజాగా వెలువడిన ఈ సర్వే ఫలితాల ప్రకారం.. తొమ్మిది శాతం పాయింట్లతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముందుకు దూసుకెళ్లారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు నిర్వహించిన అనంతరం హిల్లరీ ఈ స్థాయిలో ముందుకెళ్లడం నిజంగా విశేషమని అంటున్నారు. సీఎన్ ఎన్/ఓఆర్సీ ఈ జాతీయ సర్వే నిర్వహించింది. అంతకుముందు 52శాతం పాయింట్లతో ముందున్న ట్రంప్ తొమ్మిది పాయింట్లు తగ్గిపోయి 43శాతం పాయింట్లతో కిందికి దిగిపోగా, హిల్లరీ 58శాతం పాయింట్లతో ముందుకొచ్చేసింది. మహిళా లోకంతోపాటు శ్వేతజాతీయేతరులు - స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా హిల్లరీకి లభించినట్లు సర్వే తేల్చిచెప్పింది.

అంతేకాకుండా.. గతంలో హిల్లరీకి శాండర్స్ మద్దతుదారులు 78శాతం ఉండగా ఈ సదస్సు అనంతరం వారు 91శాతానికి పెరిగినట్లు కూడా సర్వే పేర్కొంది. దీంతో డెమొక్రటిక్ పార్టీలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అందుకే ట్రంప్ కూడా విమర్శల జోరు పెంచారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.

English summary

Hillary Clinton takes lead on Donald Trump