'వర్షం' హిందీ రీమేక్‌ ట్రైలర్‌ అదిరిపోయింది

Hindi movie Baaghi trailer

03:07 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Hindi movie Baaghi trailer

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ని హీరోగా నిలబెట్టిన చిత్రం 'వర్షం'. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో సబ్బిర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటిస్తుండగా, ఇందులో అతని సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో గోపీచంద్‌ నటించిన పాత్రలో మహేష్‌ బావ సుధీర్‌ బాబు ఇందులో నటిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. అవ్వడానికి 'వర్షం' స్టోరీనే అయినా పూర్తిగా వాళ్ల నేటివేటికి తగ్గట్టుగా మార్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.

ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు, శ్రద్ధా దాస్‌ అందచందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సజిద్‌ నదియద్‌వాలా నిర్మింస్తుండగా యూటీవి మోషన్‌ పిక్చర్స్‌ పతాకం పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం 2016 ఏప్రిల్‌ 29న విడుదలవ్వబోతుంది.

English summary

Tollywood block buster Young Rebel Star Prabhas Varsham movie were remaked in Hindi. This movie Baaghi trailer were released.