శివ నామ స్మరణతో కార్తిక పౌర్ణమి సందడే సందడి 

Hindu, Jain and Sikh holy festival, celebrated on the Purnima

11:33 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Hindu, Jain and Sikh holy festival, celebrated on the Purnima

పవిత్ర కార్తిక మాసం ... అందునా పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్త జనంతో కిక్కిరిసి పోయాయి. గోదావరి తీరం వెంబడి వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు, పంచారామాలతో పాటూ చిన్న చిన్న శివాలయాలు , అలాగే విష్ణాలయాలు కూడా భక్తజనంతో నిండిపోయాయి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. తెల్లవారు ఘామునుంచే గోదావరి లో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తూ , శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు , అర్చనలు జరిపించుకుంటున్నారు. నదుల్లో , చెరువుల్లో కార్తిక దీపాలు వదిలిపెట్టారు.

అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్దయెత్తున భక్తులు స్వామి వారిని దర్సిస్తున్నారు. అలాగే ఎక్కువమంది భక్తులు ఈవేళ స్వామి వారి వ్రతం కూడా చేయించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రసిద్ధ క్షేత్రాలైన శ్రీశైలం ,శ్రీ కాళహస్తి, రాజమండ్రి , ద్రాక్షారామం , అమరావతి , పాలకొల్లు , భీమవరం , సామర్లకోట , వేములవాడ . కాళేశ్వరం ధర్మపురి , కొండగుట్ట , భద్రాచలం , గుంటూరు , విజయవాడ , విశాఖ , శ్రీకాకుళం , కొవ్వూరు , తదితర చోట్ల ఆలయాలు భక్తజనంతో సందడిగా మారాయి. భక్తులు బారులు తీరారు. భద్రాచలం లో కార్తిక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం హారతి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రాలయంలో తుంగ హారతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసారు. ఖమ్మంలో శ్రీ స్వరూపా నందేంద్ర స్వామి పర్యవేక్షణలో హారతి ఇస్తారు. రాజమండ్రి పుష్కర ఘాట్ లో నిత్య హారతి తో పాటూ కోటిలింగాల రేవులో లక్ష దీపోత్సవం జరుగనుంది.

ఇక కార్తిక పౌర్ణమి సందర్భంగా పలువురు భక్తలు నోములు , వ్రతాలు ఆచరిస్తున్నారు . ఉపవాసం తో శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజా సామాగ్రి విక్రయించే షాపులతో పాటు పలు చోట్ల పూజా సామాగ్రి , పువ్వులు , పత్రీ విక్రయించే తాత్కాలిక షాపులు ఏర్పడడంతో అన్ని చోట్లా, రద్దీ నెలకొంది. కాగా కొబ్బరికాయలు , అరటిపళ్ళు , వివిధ రకాల పళ్ళు , పూల రేట్లు హెచ్చాయి.

English summary

All Shiva Temples are being rush with huge devotes in the occassion of karthika purnima. All the Shiva temples in Andhra Pradesh ,Telangana states ane rushed with piligrims