పెళ్ళికి రెడీయా... అయితే ఏ తేదీలు అనుకూలమో తెలుసుకోండి

Hindu Marriage Wedding Dates 2017

11:50 AM ON 3rd January, 2017 By Mirchi Vilas

Hindu Marriage Wedding Dates 2017

పెళ్లంటే నూరేళ్ళ పంట. రెండు మనసులు ఒకటవ్వాలి ... ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమనే శుభకార్యం పెళ్లి. అది ఏరకమైన సరే, ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా పెళ్లి నిర్వహిస్తుంటారు. అయితే ఏ వర్గం వారు వివాహ శుభకార్యాన్ని నిర్వహించినా హిందువులు నిర్వహించే పద్ధతి మాత్రం కొంచెం విభిన్నంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే వారు ముందుగా వధూ వరుల జాతకాలను బట్టి ముహూర్తాలను నిర్ణయించి అనంతరం ఫలానా తేదీ, ఫలానా సమయం అని చెప్పి దాని ప్రకారం పెళ్లిళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారు నిర్ణయించే తేదీ, సమయం ప్రకారమే వివాహాలు నిర్వహిస్తారు. అయితే వివాహ తేదీల విషయానికి వస్తే 2017లో ఏయే నెలల్లో ఏయే తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

1/13 Pages

జనవరిలో…

ఈ నెలలో కేవలం 29వ తేదీ నాడే వివాహాలకు అనుకూలంగా ఉంది. అదే రోజు పెళ్లిళ్లు ఎక్కువగా అయ్యేందుకు అవకాశం ఉందట.

English summary

In India so many religions of people live together and everyone will have their own different religions. Hindu marriages were done by following some traditions and here are the list of Hindu Marriages dates of the year 2017.