దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కోడతారో తెలుసా ?

Hindu ritual of Coconut Breaking

07:28 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Hindu ritual of Coconut Breaking

ఈ సృష్టి లో ఏకైక నీరు ఉన్న కాయ కొబ్బరి కాయ. ఇది పూజల్లో, శుభకార్యాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి కాయ అంటే మన శరీరమే. కొబ్బరి కాయ పైన ఉన్నచర్మం మన చర్మాన్ని చూచిస్తుంది అలాగే లోపల ఉన్న పీచు మన మాంసం, ఇంకా పెంకె ఎముక, అందులోని నీరు మన ప్రాణాధారం.

శుభ కార్యాలలో, పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను కొట్టడం హిందువుల ఆనవాయితీ. అసలు దేవుడి ముందు కొబ్బరి కాయను ఎందుకు కొడతారో తెలుసా..కొబ్బరి కాయ పైన ఉన్న పెంకు మనలోని అహంకారానికి ప్రతీకగా నిలుస్తుంది. అందువల్ల మనం ఎప్పుడైతే కొబ్బరి కాయను దేవుడి ముందు కొడుతున్నామో అప్పుడు మన అహంకారాన్ని వదులుతున్నాం అని అర్ధం. మన అహంకారాన్ని విడనాడి లోపల ఉన్న తెల్లని కొబ్బరిలాగా మన మన్నస్సు కుడా స్వచ్చం గా ఆ భగవంతుడి ముందు ఉంచామని అర్ధం. అలా నిర్మలమైన కొబ్బరి నీరులాగా తమ జీవితాలను ఉంచమని ఆ దేవుడిని మనం కోరుకుంటున్నాం అనమాట.

ఇది కూడా చదవండి :ఇవి మన వాళ్ళు కనిపెట్టినవే

ఇది కూడా చదవండి :శ్రీ దుర్ముఖిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి

ఇది కూడా చదవండి :పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

English summary

Hindu ritual of Coconut Breaking